KTR | ఒక నేరస్థుడు, క్రిమినల్ మనస్తత్వం, క్రిమినల్ ప్రవృత్తి కలిగిన ముఖ్యమంత్రి ఈ రోజు తెలంగాణకు దాపురించడం తెలంగాణ ప్రజల దురదృష్ణకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. నిన్న మా ఇద్దరు మహిళా నాయకురాళ్లు, ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మీద అత్యంత హేయమైన, అత్యంత నీచమైన దాడి చేయడమే కాకుండా వారిని జుట్టు పట్టి లాగి గొంతు పట్టుకుని, చీర లాగి ఒక దుశ్శాసన పర్వానికి తెరలేపడమే కాకుండా వారి అసమర్థతను, వారి పరిపాలనలో చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవాళ స్పీకర్‌ను అడ్డం పెట్టుకుని, స్పీకర్ కులాన్ని అడ్డం పెట్టుకుని చిల్లర రాజకీయానికి రేవంత్ రెడ్డి తెరలేపిండని ఫైర్ అయ్యారు.
అందులో ఇంకా విచిత్రమైన మాట మా శాసన మండలి సభ్యుడు నిజానికి స్పీకర్‌ను ఉద్దేశించి ఏమీ అనలేదని కేటీఆర్ అన్నారు. అనకపోయినా నిన్ననే మా నాయకుడు కేసీఆర్ ఆదేశం మేరకు సభ్యుడు ముందుకొచ్చి నేను స్పీకర్‌ను అనలేదు.. నాకు స్పీకర్ అంటే ఎనలేని గౌరవం ఉంది. కానీ స్పీకర్ ఒకవేళ బాధపడితే నేను ఆ మాటను ఉపసంహరించుకుంటున్నా.. విచారం వ్యక్తం చేస్తున్నా అని 24 గంటల కిందటనే మా నాయకుడు కేసీఆర్ ఆదేశం మేరకు స్పష్టంగా పత్రికాముఖంగా, లిఖిత పూర్వకంగా చెప్పడం జరిగిందన్నారు. కానీ కోతికి కొబ్బరిచిప్ప దొరికినట్టు ఈ రేవంత్ రెడ్డి అనే చిల్లరగానికి ఈ అంశాన్ని పట్టుకొని ఇందులో ఎట్లానైనా రాజకీయంగా లాభం పొందాలని చెప్పి కాంగ్రెస్ గూండాలను, కొంతమంది శాసనసభ్యులను ఉసిగొల్పి గజ్వేల్‌లో కేసీఆర్ ఇంటిమీదికి పోలీస్ ఎస్కార్ట్‌ను పెట్టి వేల మందిని పంపించాడని ఆరోపించారు.
ఆయన చేతుల్లో ఇయ్యాళ్ల రాజకీయ పదవి ఉంది. అధికారం ఉందని చెప్పి కాంగ్రెస్ గూండాలను పంపించడం జరిగిందన్నారు. పంపడమే కాకుండా ఇద్దరు కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ఇవాళ రేవంత్ రెడ్డి ప్రోద్భలం మేరకే రేవంత్ రెడ్డి మనసులోని మాటను కేసీఆర్ చనిపోవాలి.. అని మాట్లాడిన మాట ఇవాళ తెలంగాణ గుండెను గాయపరిచింది. ఎందుకు చనిపోవాలి కేసీఆర్.. తెలంగాణను తెచ్చి కోట్లాదిమంది పిల్లలకు బంగారు భవిష్యత్‌ను ప్రసాదించినందుకా.. అని కేటీఆర్ ప్రశ్నించారు.
హిట్లర్ కంటే ఘోరమైన గతి..
రేవంత్ రెడ్డికి హిట్లర్ కంటే ఘోరమైన గతి పడుతదని కేటీఆర్ హెచ్చరించారు. ఇంకా 823 రోజులు మాత్రమే ఉంది.. నిన్ను వదిలిపెట్టం రేవంత్ రెడ్డి. మా నాయకుడి దగ్గరికి వెళ్తుంటే మమ్మల్ని అరెస్ట్ చేసి బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు. చట్టాలను గౌరవించి మేము పోలీస్ స్టేషన్లో ఉంటే, కాంగ్రెస్ నాయకులు గూండాలను ఉసిగొల్పి మా మీద దాడి చేయించే ప్రయత్నం చేశారు. ఈ కాంగ్రెస్ నాయకులకు చట్టాల మీద, న్యాయవ్యవస్థ మీద గౌరవం లేదన్నారు కేటీఆర్.
నిన్న మా మహిళా ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి మీద దాడి చేసి, జుట్టు పట్టి, చీర లాగి ఒక దుశ్శాసన పర్వానికి తెరలేపారు
ఇవాళ వాళ్ల తప్పుని కప్పిపుచ్చుకొడానికి స్పీకర్ గారి కులాన్ని అడ్డుపెట్టుకొని చిల్లర రాజకీయానికి రేవంత్ రెడ్డి తెరలేపాడు
స్పీకర్ గారిని… https://t.co/TrG5V4pxBo pic.twitter.com/eNu6GZvLUP
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026
National Film Awards | ఢిల్లీకి వీడ్కోలు.. జాతీయ చలనచిత్ర అవార్డుల వేదికలో కీలక మార్పు!
Punjab Farmer: పంజాబ్‌లో డ్రగ్స్.. రైతు ఆత్మహత్యతో తీవ్ర దుమారం