అమరావతి : విజయవాడ దుర్గగుడి ( Durga Temple ) ఘాట్ రోడ్డుపై కొండచరియలు ( Landslide ) విరిగిపడ్డాయి. దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఘాట్రోడ్లో మరమ్మతుల కారణంగా రోడ్డును మూసివేసిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో పెను ప్రమాదం తప్పింది.
ఈ ఘటన పై మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి అధికారులను అడిగి పూర్తి వివరాలు తెలుసు కున్నారు. భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులను ఆదేశించారు .అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు.