Omar Abdullah: పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను పునరుద్దరించండి: జమ్మూకశ్మీర్ అసెంబ్లీలో తీర్మానం
Omar Abdullah: జమ్మూకశ్మీర్‌కు పూర్తి స్థాయిలో రాష్ట్ర హోదాను పునరుద్దించాలని కోరుతూ ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీలో సీఎం ఒమర్ అబ్దుల్లా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొన్నది. ట్రెజరీ బెంచీలు, విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌కు పూర్తి స్థాయిలో రాష్ట్ర హోదాను పునరుద్దించాలని కోరుతూ ఇవాళ ఆ రాష్ట్ర అసెంబ్లీలో సీఎం ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొన్నది. ట్రెజరీ బెంచీలు, విపక్షాల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తర్వాత.. సీఎం ఒమర్ ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. తొలుత 2000 జూన్ 26న, ఆ తర్వాత 2024, నవంబర్ 6వ తేదీల్లో ఇదే సభలో తీర్మానాన్ని పాస్ చేశామని, అయితే తాజా తీర్మానం పట్ల కేంద్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, జమ్మూ కశ్మీర్‌కు పూర్తి స్థాయిలో రాష్ట్ర హోదాను పునరుద్దరించాలని ఆయన కోరారు.
జమ్మూకశ్మీర్ రాష్ట్రానికి స్వయంప్రతిపత్తి కల్పించాలని కోరుతూ 2000 సంవత్సరంలో ఎన్సీ నేతృత్వంలోని ఫారూక్ అబ్దుల్లా ప్రభుత్వం తీర్మానాన్ని అసెంబ్లీలో పాస్ చేసింది. 2019లో రద్దు చేసిన ప్రత్యేక హోదాను పునరుద్దరించాలని కోరుతూ 2024లో అసెంబ్లీ తీర్మానించింది. జమ్మూకశ్మీర్‌కు పూర్తి స్థాయి రాష్ట్ర హోదాను కల్పిస్తామని కేంద్రం హామీ ఇచ్చిందని, ఇప్పుడు ఆ హోదాను పునరుద్దరించాలని ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

