BRS | బోయిన్పల్లి పోలీస్ స్టేషన్‌పై దాడికి వచ్చిన కాంగ్రెస్ గూండాలకు బీఆర్ఎస్ శ్రేణులు తగిన రీతిలో బుద్ధి చెప్పాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బోయిన్పల్లి పోలీస్ స్టేషన్లో ఉన్న విషయం తెలుసుకున్నకాంగ్రెస్ గూండాలు దాడి చేసేందుకు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ శ్రేణులు వారికి దేహశుద్ధి చేసి అక్కడి నుంచి తరిమితరిమి కొట్టారు.
కాగా, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ అరాచకపర్వం కొనసాగుతోంది. ఎర్రవెల్లిలోని కేసీఆర్ నివాసంపై దాడికి కాంగ్రెస్ గూండాలు బయల్దేరారు. కేసీఆర్‌పై జరుగుతున్న ఈ కుట్రలు తెలిసిన కేటీఆర్, హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నఫళంగా అసెంబ్లీ నుంచి ఎర్రవెల్లికి బయల్దేరారు. ఈ క్రమంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నాయకులతో పోలీసులు అహంకారపూరితంగా ప్రవర్తించారు. ఎవడ్రా నువ్వు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల జులుం ప్రదర్శించారు. కేటీఆర్‌ను బోయిన్పల్లి పోలీస్ స్టేషన్‌కు, హరీశ్ రావును జవహర్ నగర్ స్టేషన్‌కు తరలించారు.
బోయిన్ పల్లి పోలీస్ స్టేషన్ వద్ద కాంగ్రెస్ గుండాలకు దేహశుద్ది చేసి తరిమికొట్టిన బీఆర్ఎస్ కార్యకర్తలు https://t.co/pV2vencN67 pic.twitter.com/8ZUVeDrvvC
— Telugu Scribe (@TeluguScribe) September 8, 2026