‘నేను శైలజ’ సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన మలయాళ బ్యూటీ కీర్తి సురేష్. ‘మహానటి’ సావిత్రి బయోపిక్‌తో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నది. పాత్ర ఏదైనా సరే తన నటనతో ప్రేక్షకుల మనసు దోచుకుంటున్న కీర్తి వరుస చిత్రాలతో మళ్లీ బిజీగా మారింది. నాని హీరోగా నటించిన ‘ది ప్యారడైజ్’ సినిమాలో ‘యేషనాగుల కట్టమీద’ స్పెషల్ సాంగ్‌కు అదిరిపోయే స్టెప్పులేసింది. బుజ్జవ్వ పంచుకున్న కార్వాన్ కబుర్లు ఈ వారం మీ కోసం.
నాని, నేను మంచి మిత్రులం. ఆ స్నేహమే ‘ది ప్యారడైజ్’లో స్పెషల్ సాంగ్ చేసేందుకు కారణమైంది. ఈ సాంగ్ షూటింగ్ సమయంలో తన జడలు ముట్టుకుంటే మాత్రం నానికి సుర్రుమనేది. యేషనాగుల పాటలో ఆర్టిస్టులు, డ్యాన్సర్లు కలిపి సుమారు వెయ్యి మంది వరకు ఉంటారు. ఆ పాట భలే జోష్‌ఫుల్‌గా సాగిపోయింది.
యోగా నా జీవితంలో పెద్ద మార్పు తెచ్చింది. మానసిక ప్రశాంతత, ఆత్మవిశ్వాసం, శరీరంపై ప్రేమ పెరిగేందుకు దోహదం చేసింది. యోగా నా దినచర్యలో భాగం చేసుకున్నాను.
ఇప్పుడే నా జీవితంలో బెస్ట్ ఫేజ్‌లో ఉన్నాననే ఫీలింగ్ ఏర్పడుతున్నది.
హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న సినిమాలతోపాటు స్టార్ హీరోల చిత్రాల్లో ప్రత్యేక మెరుపులు మెరిపిస్తున్నాను. తెలుగులో విజయ్ దేవరకొండతో కలిసి ‘రౌడీ జనార్దన’, అనిల్ రావుపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్ నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాను.
తల్లిదండ్రుల ప్రభావంతోనే నేను సినిమాల్లోకి వచ్చాను. 2000లో బాలనటిగా తెరంగేట్రం చేశాను. 2013లో మలయాళ చిత్రం ‘గీజాంజలి’తో హీరోయిన్గా పరిచయమయ్యాను.
అనిల్ రావుపూడి దర్శకత్వంలో వచ్చే మల్టీస్టారర్ మూవీ రీమేక్ అని కొందరు కావాలని ప్రచారం చేస్తున్నారు. ఆయన సొంతంగా రాసుకున్న సరికొత్త వైవిధ్యమైన కథ ఇది. ఆయన మార్క్ పక్కా ఒరిజినల్ స్క్రిప్ట్. అవుడ్ అండ్ అవుట్ ఎంటర్టైనర్.
కెరీర్ మొదట్లో ఫిట్‌నెస్‌పై అవగాహన ఉండేది కాదు. జిమ్‌కు వెళ్లడం నా వల్ల కాదు అనుకునేదాన్ని. ‘మహానటి’ తర్వాత కాస్త గ్యాప్ దొరకడంతో ఫిట్‌నెస్‌పై దృష్టి పెట్టాను. కష్టపడి బరువు తగ్గితే.. ‘బహీనంగా కనిపిస్తున్నావు, సర్జరీలు చేయించుకున్నావా’ అని కొందరు అడగడంతో నిరాశకు గురయ్యాను.