PM Narendra Modi | ప్రధాని సభా ప్రాంగణంలో భద్రతా వైఫల్యం.. నకిలీ అధికారి అరెస్ట్, తుపాకీ స్వాధీనం..!
PM Narendra Modi : ప్రధాని నరేంద్ మోడీ ముంబై పర్యటనకు కొన్ని గంటల ముందే కలకలం రేగింది. ప్రధాని సభా ప్రాంగణంలో భద్రతా వైఫల్యం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు ఒక అధికారి, అతడి బాడీగార్డ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
PM Narendra Modi : ప్రధాని నరేంద్ మోడీ ముంబై పర్యటనకు కొన్ని గంటల ముందే కలకలం రేగింది. ప్రధాని సభా ప్రాంగణంలో భద్రతా వైఫల్యం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో ఇద్దరు ఒక అధికారి, అతడి బాడీగార్డ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన మంత్రి కార్యాలయం అధికారిగా ఫోర్జరీ ఐడీ కార్డు కలిగిన వ్యక్తిని, అతడి బాడీగార్డ్‌ను అదుపులోకి తీసుకున్నారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్లో వీరు అనుమానాస్పందంగా సంచరించడంతో పోలీసులు తనిఖీ చేశారు. దాంతో, ఇద్దరూ దొరికిపోయారు. వీరి నుంచి ఒక తుపాకీ స్వాధీనం చేసుకున్నారు.
ముంబైలోని జియో వరల్డ్ సెంటర్లో ప్రధాని నరేంద్ర మోడీ సభ ఆరంభానికి భద్రతా వైఫల్యం నెలకొంది. ఫిన్‌టెక్ ఫెస్ట్ 2026 ఆవిష్కరణకు ప్రధాని రాక నేపథ్యంలో ఇద్దరు వ్యక్తులు నకిలీ గుర్తింపు కార్డులతో సభా ప్రాంగణంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లోని నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్లో అనుమానాస్పదంగా సంచరిస్తున్న వీరిని తనిఖీ చేసిన పోలీసులు అనంతరం.. అదుపులోకి తీసుకున్నారు.
⚡Security Scare At PM Modi’s Mumbai Event: Armed Imposter Detained
Local police intercepted 24-year-old Rohan Parekh at the Nita Mukesh Ambani Cultural Centre after he allegedly tried to gain entry using a forged PMO identity card. (NDTV)
Officers recovered a firearm from an… pic.twitter.com/vilbNh7V7m
— RT_India (@RT_India_news) September 8, 2026
ప్రధాన మంత్రి కార్యాలయం అధికారిగా నకిలీ ఐడీ కార్డు కలిగిన వ్యక్తిని రోషన్ పరేఖ్‌గా గుర్తించారు. అతడి బాడీగార్డ్ నుంచి తుపాకీని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఉన్నత స్థాయి భద్రత ఉన్నప్పటికీ వీరిద్దరు నకిలీ ఐడీ కార్డులతో అంత దూరం ఎలా రాగలిగారు? అనే కోణంలో ముంబై నేర విభాగం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Imposter PMO official detained with bodygaurd carrying a gun ahead of PM Modi’s event in BKChttps://t.co/8GdHjt3sL0
— Economic Times (@EconomicTimes) September 8, 2026
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

