Viral Video: తగ్గేదేలే అంటున్న ఏనుగు… జేసీబీతో భీకర పోరు!
న్యూఢిల్లీ: సాధారణంగా ఏనుగులు చాలా ప్రశాంతంగా ఉంటాయి. ముచ్చట గొలుపుతూ మనుషులతో మమేకమవుతుంటాయి. అయితే ఏనుగులకు ఆగ్రహం వస్తే భరించడం చాలా కష్టం. వాటిని నియంత్రించడం మనుషులకే కాదు యంత్రాలకూ సాధ్యం కాదు. అందుకు ఉదాహరణగా నిలుస్తున్నది ఈ ఘటన. తవ్వకాలు జరిపే జేసీబీ, ఏనుగు మధ్య జరిగిన పోరుకు సంబంధించిన వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నది. ‘వైల్డ్ యానిమల్స్ క్రియేషన్’ అనే ఇన్‌స్టాగ్రామ్‌లో శుక్రవారం పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
వ్యవసాయ క్షేత్రంలోకి వచ్చిన ఒక ఏనుగును జేసీబీతో తరిమేందుకు ఒక వ్యక్తి ప్రయత్నిస్తాడు. దీంతో తొలుత అక్కడి నుంచి వెళ్లేందుకు కొంత ముందుకు వెళ్లిన ఆ ఏనుగు అనంతరం తగ్గేదేలే అని భావించింది. పరుగున వెనక్కి వచ్చి జేసీబీతో తలపడింది. తన తొండంతో దానిని ముందుకు తోస్తుంది. జేసీబీకి ముందు ఉన్న తవ్వే పరికరంతో గాయపడే ప్రమాదమున్నప్పటికీ ఆ ఏనుగు ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు.
మరోవైపు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. ఏనుగు తనను తాను రక్షించుకునేందుకు చేసిన ప్రయత్నాన్ని చాలా మంది సమర్థించారు. ఆ వ్యక్తి జేసీబీతో ఏనుగుపై దాడి చేయడాన్ని తప్పుపట్టారు.
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

