ఇది కలియుగం. ఇన్స్టాంట్ కర్మలను చూస్తున్నాం. అంటే.. ఇప్పుడు పాపం చేస్తే వెంటనే దాని ఫలితం అనుభవిస్తున్నాం. అందుకే.. ఎవరికి ఎటువంటి ఆపద తలపెట్టకుండా ఎవరి బతుకు వాళ్లు బతకాలి అని పెద్దలు అంటుంటారు. మనుషులైనా.. జంతువులైనా వేటిని కూడా హింసించరాదు. మనుషులైతే ఎదురు తిరుగుతారు కానీ.. మూగ జీవాలను హింసిస్తే పాపం అవి ఎదురు కూడా తిరగలేవు. దాన్నే అలుసుగా తీసుకొని మూగజీవాలపై చాలామంది రెచ్చిపోతుంటారు.
ఇలాగే ఓ వీధి కుక్కపై తన ప్రతాపాన్ని చూపించిన ఓ వ్యక్తికి టిట్ ఫర్ టాట్ అయింది. కుక్క చెవులను పట్టుకొని పైకి లాగి.. దాన్ని చిత్రవధ చేశాడు ఓ వ్యక్తి. అక్కడున్న వాళ్లంతా వీడియోలు తీస్తూ నిలబడ్డారు తప్పితే ఒక్కరు కూడా ఆ వ్యక్తిని అడ్డుకోలేదు. ఒక మూగ జీవి బాధ మరో మూగ జీవికే తెలుస్తుంది కాబోలు.. వెంటనే అక్కడికి ఓ ఆవు పరిగెత్తుకొచ్చి.. కుక్కను హింసిస్తున్న ఆ వ్యక్తిపై విరుచుకుపడింది. తన కొమ్ములతో అతడిపై దాడి చేసింది. దీంతో అతడు ఆ కుక్కను వదిలిపెట్టేశాడు. దీంతో బతుకు జీవుడా అంటూ ఆ కుక్క అక్కడి నుంచి పారిపోయింది. ఈ వీడియోను ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్ సుశాంత నంద.. తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Karma 🙏🙏 pic.twitter.com/AzduZTqXH6
— Susanta Nanda IFS (@susantananda3) October 31, 2021
That cow is better than that person taking pic😡
— Pr 🇮🇳 (@PrTox) October 31, 2021
An animal understood another animal pain.. when people standing around can't do anything..
— Sharanbasav M Mannapur (@MannapurM) October 31, 2021
I like this version. Instant Karma.
— Thinking Hearts (@ThinkingHearts) October 31, 2021
Quick. Reciprocal. Painful. https://t.co/qiEd2ggxL7
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Smart Monkey : దీని తెలివి తెల్లార.. ఈ కోతి తెలివి చూస్తే నోరెళ్లబెడతారు.. వైరల్ వీడియో
సెకండ్ క్లాస్ పిల్లాడిని బిల్డింగ్ మీద తలకిందులుగా వేలాడదీసిన హెడ్మాస్టర్.. వైరల్ ఫోటో
Penis Plant : ఈ పువ్వు పూయడమే చాలా అరుదు.. దీని దగ్గరికి వెళ్తే కంపు వాసన
Model Photoshoot : తండ్రి శవం పక్కన మోడల్ ఫోటోషూట్.. నువ్వు మనిషివేనా అంటున్న నెటిజన్లు
పెండ్లికి ముందే శృంగారం.. మైనర్ బాలికకు గర్భం.. యూట్యూబ్ వీడియో చూస్తూ సీక్రెట్‌గా డెలివరీ..!
Squid Game : స్క్విడ్ గేమ్ వీఐపీ యాక్టర్ గెయోఫ్రే గుర్తున్నాడా? ఆయనకు ఇండియాతో కనెక్షన్ ఉందట