పెళ్లి అనేది ప్రతి మనిషికి జీవితంలో ఒకేసారి జరుగుతుంది. అందుకే.. పెళ్లి తాలుకు మధుర క్షణాలను, ఆ జ్ఞాపకాలను జీవితాంతం గుర్తుంచుకోవడం కోసం చాలామంది తమ పెళ్లిని చాలా గ్రాండ్‌గా, ప్రత్యేకంగా జరుపుకుంటారు. అందుకే.. తమ పెళ్లిళ్లలో డ్యాన్సులు వేయడం, పాటలు పాడటం.. సరికొత్తగా ట్రై చేసి వార్తల్లో నిలుస్తున్నారు నేటి యువత.
ఇప్పటికే పెళ్లి సమయంలో జరిగిన చిలిపి ఘటనలు.. పెళ్లిలో డ్యాన్స్ వేసిన పెళ్లికూతురు.. ఇలా చాలా వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా.. అటువంటిదో మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తోంది.
కొద్ది సేపట్లో తన పెళ్లి ప్రారంభం అవుతుందనగా.. పెళ్లి కొడుకు డ్యాన్స్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇంతలో పెళ్లికూతురు నడుచుకుంటూ వస్తుంది. తనను చూస్తూ ఇంకా స్టెప్స్ పెంచుతాడు. తన దగ్గరికి డ్యాన్స్ చేసుకుంటూ వెళ్లి తనను కౌగిలించుకుంటాడు. పెళ్లి కాకముందే.. పెళ్లి కొడుకు.. వధువుపై చూపించే ప్రేమను చూసి పెళ్లికి వచ్చిన అతిథులు అంతా షాక్ అవుతారు. నెటిజన్లు కూడా ఆ వీడియోను చూసి.. ఆ పెళ్లికొడుకును మెచ్చుకుంటున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Golden Modak : బంగారపు పూతతో మోదక్.. కిలో ధర ఎంతో తెలిస్తే షాకవుతారు
Touch it : సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్.. టచ్ ఇట్.. ఏంటి దీని స్పెషాలిటీ?
Taxi Top Garden : కరోనా ఎఫెక్ట్.. క్యాబ్‌లను ఖాళీగా ఉంచలేక.. టాప్ మీద గార్డెన్ ఏర్పాటు
SpiderMan Daughter : స్పైడర్‌మ్యాన్ కూతురులా ఉంది.. చకచకా ఎలా ఇంటిగోడను ఎక్కేసిందో చూడండి
Crazy Dance : బాబోయ్.. ఇదేం డ్యాన్స్.. మతిపోతుంది.. వైరల్ వీడియో
Heartbreaking Video : బేబీ డాల్ఫిన్ చనిపోయిందని తెలిసి.. తల్లి డాల్ఫిన్ ఏం చేసిందో చూడండి