Golden Modak : బంగారపు పూతతో మోదక్.. కిలో ధర ఎంతో తెలిస్తే షాకవుతారు
బంగారపు పూతతో మోదక్ | నిన్ననే గణపతి నిమజ్జనం ముగిసింది. అయినప్పటికీ.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇవాళ కూడా నిమజ్జనం కొనసాగుతోంది.

నిన్ననే గణపతి నిమజ్జనం ముగిసింది. అయినప్పటికీ.. ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఇవాళ కూడా నిమజ్జనం కొనసాగుతోంది. ఈనేపథ్యంలో.. ఓ స్వీట్ షాప్ గణేశుడికి ఎంతో ఇష్టమైన మోదక్‌లను స్పెషల్‌గా చేసి అమ్ముతోంది.

గణేశ్ చతుర్థి రోజున ఎవరి ఇంట్లో చూసినా ఖచ్చితంగా మోదక్‌లు ఉంటాయి. గణపతికి మోదక్‌లను నైవేద్యంగా పెడుతుంటారు. అయితే.. ఈ మోదక్‌లు మాత్రం మామూలు మోదక్‌లు కాదు.. బంగారం పూతతో చేసినవి. అందుకే.. ఆ స్వీట్ షాప్‌లో కిలో మోదక్‌లను 12 వేల రూపాయలకు అమ్ముతున్నారు. మహారాష్ట్రలోని నాసిక్‌లో ఉన్న ఓ స్వీట్ షాప్‌లోనే ఈ మోదక్‌లు దొరికేది.

కేవలం గోల్డెన్ మోదక్లే కాదు.. వాళ్ల దగ్గర సిల్వర్ మోదక్.. ఇంకా 25 రకాల వెరైటీలతో చేసిన మోదక్‌లు వాళ్లు దగ్గర ఉన్నాయి. ప్రస్తుతం ఈ గోల్డెన్ మోదక్‌లు మాత్రం సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తున్నాయి. గణేశుడికి ఎంతో ఇష్టమైన ఈ మోదక్‌లను బంగారపు పూతతో చేసినా కూడా కొనేందుకు జనాలు మాత్రం ఆసక్తి చూపిస్తుండటం విశేషం.
Maharashtra | As Ganesh Chaturthi festivities continue, a sweet shop in Nashik is selling 'golden modak' at Rs 12,000 per kg
— Director Of Global Computer (@DirectorOfGlob2) September 17, 2021
"We have received a good response. We have prepared 25 other types of Modak as well. We made a good sale," said Deepak Chaudhary of Sagar Sweets (16.09) pic.twitter.com/EX5iwvtr7q
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Taxi Top Garden : కరోనా ఎఫెక్ట్.. క్యాబ్‌లను ఖాళీగా ఉంచలేక.. టాప్ మీద గార్డెన్ ఏర్పాటు
SpiderMan Daughter : స్పైడర్‌మ్యాన్ కూతురులా ఉంది.. చకచకా ఎలా ఇంటిగోడను ఎక్కేసిందో చూడండి
Crazy Dance : బాబోయ్.. ఇదేం డ్యాన్స్.. మతిపోతుంది.. వైరల్ వీడియో
Heartbreaking Video : బేబీ డాల్ఫిన్ చనిపోయిందని తెలిసి.. తల్లి డాల్ఫిన్ ఏం చేసిందో చూడండి
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

