Touch it : సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్.. టచ్ ఇట్.. ఏంటి దీని స్పెషాలిటీ?
సోషల్ మీడియాలో సరికొత్త ట్రెండ్.. టచ్ ఇట్ | సాధారణంగా ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడితే.. అందులో ఎక్కువగా ఫోటోలు షేర్ అవుతుంటాయి.
సాధారణంగా ఇన్స్టాగ్రామ్ గురించి మాట్లాడితే.. అందులో ఎక్కువగా ఫోటోలు షేర్ అవుతుంటాయి. అందులో కొన్ని వైరల్ కూడా అవుతుంటాయి. అయితే.. ఈ మధ్య కాలంలో ఇన్‌స్టాగ్రామ్‌లో ఫోటోలకన్నా.. వీడియోలు ఎక్కువగా షేర్ అవుతున్నాయి. అందులో కొన్ని ట్రెండ్ అవుతున్నాయి. అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా.. ఇన్‌స్టాగ్రామ్‌లో టచ్ ఇట్ అనే సరికొత్త చాలెంజ్ ట్రెండ్ అవుతుంది. ఈ చాలెంజ్‌లో భాగంగా.. ఇంట్లోని పెద్దలు అంతా.. వరుస క్రమంలో నిలబడి.. పాటకు డ్యాన్స్ వేస్తూ.. పిల్లలకు తమ పాదాలు చూపిస్తూ.. పెదాల మీద వేలు పెట్టి.. ఆ తర్వాత మళ్లీ కాళ్లు చూపిస్తారు. ఇంట్లోని పిల్లలంతా వరుస క్రమంలో వచ్చి.. ఒక్కొక్కరి కాళ్ల మీద ఒక్కొక్కరు పడుతూ వెళ్లాలి. ఈ ట్రెండ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే.. పిల్లలు.. పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం. దానికి టచ్ ఇట్ అనే పేరు పెట్టారు. అంటే.. పెద్దల కాళ్లను పిల్లలు టచ్ చేయాలన్న ఉద్దేశంతో ఆ పేరు పెట్టారు.
ఈ ట్రెండ్‌ను స్టార్ట్ చేసింది అంకిత మాత్రె అనే యువతి. తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోనే ఈ వీడియోను షేర్ చేయడంతో.. ఈ ట్రెండ్.. నెటిజన్లకు బాగా నచ్చుతోంది. దీంతో.. నెటిజన్లు కూడా టచ్ ఇట్ చాలెంజ్‌లో పార్టిసిపేట్ చేస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Taxi Top Garden : కరోనా ఎఫెక్ట్.. క్యాబ్‌లను ఖాళీగా ఉంచలేక.. టాప్ మీద గార్డెన్ ఏర్పాటు
SpiderMan Daughter : స్పైడర్‌మ్యాన్ కూతురులా ఉంది.. చకచకా ఎలా ఇంటిగోడను ఎక్కేసిందో చూడండి
Crazy Dance : బాబోయ్.. ఇదేం డ్యాన్స్.. మతిపోతుంది.. వైరల్ వీడియో
Heartbreaking Video : బేబీ డాల్ఫిన్ చనిపోయిందని తెలిసి.. తల్లి డాల్ఫిన్ ఏం చేసిందో చూడండి
Read Today's Latest Trending News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

