Boxer Attacks Husband : విడాకులకు దరఖాస్తు చేసిన భారత బాక్సర్ స్వీటీ బూరా.. భర్త దీపక్ హుడాపై విరుచుకుపడింది. ఇప్పటికే అతడిపై వరకట్నం కేసు పెట్టిన స్వీటీ ఈసారి ఏకంగా పోలీస్ స్టేషన్లో అందరూ చూస్తుండగానే హుడా చొక్కా పట్టుకొని దాడి చేసింది. ఊహించని సంఘటనతో షాక్ తిన్న దీపక్.. అతడి కుటుంబసభ్యులు ఆమెను నిలువరించే ప్రయత్నం చేశారు. కానీ, కోపంతో ఊగిపోయిన బాక్సర్ ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది. అసలేం జరిగిందంటే..?
టీమిండియా కబడ్డీ జట్టు మాజీ కెప్టెన్ అయిన హుడా, బాక్సర్ స్వీటీ బూరాలు 2022లో పెళ్లి చేసుకున్నారు. అర్జున అవార్డు గ్రహీతలైన వీళ్లు కొన్నాళ్లు సంతోషంగానే ఉన్నారు. అయితే.. గత కొన్ని రోజులుగా వీళ్ల కాపురంలో కలహాలు మొదలయ్యాయి. హుడాకు డబ్బు పిచ్చి పట్టడమే అందుకు కారణం అంటున్న స్వీటీ ఈమధ్యే విడాకులకు అప్లై చేసింది. అంతేకాదు లగ్జరీ కారు కొనిచ్చినా కూడా తన భర్త అదనపు వరకట్నం డిమాండ్ చేస్తున్నాడని ఆమె ఫిబ్రవరిలో హిసార్‌లోని పోలీసులను ఆశ్రయించింది.
BREAKING: Boxer Sweety Bora Knocks Out Husband in Police Station!🚨
In a viral video from Hisar Police Station, Boxer Sweety Bora takes matters into her own hands, beating up her husband Deepak Hooda during a hearing.
Sweety has filed a divorce case, accusing Deepak of… pic.twitter.com/ouie3MzA9i
— Mohd Shadab Khan (@VoxShadabKhan) March 24, 2025
హిసార్‌లోని పోలీస్ స్టేషన్లో ఫిబ్రవరి 25న అతడిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈ క్రమంలోనే ఇరువర్గాలను మంగళవారం స్టేషన్‌కు పిలిపించారు పోలీసులు. అందరూ ఒక గదిలో కూర్చొని మాట్లాడుతుంగా.. స్వీటీ కోపంతో ఊగిపోయింది. భర్త కాలర్ పట్టుకొని దాడి చేసింది. ఊహించని పరిణామంతో షాక్ తిన్న ఇద్దరి కుటుంబ సభ్యులు.. బాక్సర్‌ను వారించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన స్వీటీ.. హుడాపై కేసు పెట్టి నెల రోజులు అవుతున్నా ఎస్పీ, పోలీసులు అతడిపై ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదని ఆరోపించింది.
‘నా భర్తపై వరకట్నం, వేధింపుల కేసు పెట్టాను. కానీ, పోలీసులు మాత్రం అతడిని ఇంకా అరెస్ట్ చేయలేదు. అతడిపై ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. అతడు ఎంచక్కా బయట తిరుగుతున్నాడు. తనకు విడాకులు మాత్రమే కావాలని కోరుతున్నా. హుడా నుంచి భరణం ఆశించేందుకు నేనేమీ బికారిని కాదు’ అని స్వీటీ చెప్పగా.. ఎస్పీ సావన్ మాత్రం కేసును దర్యాప్తు చేస్తున్నామని, సరైన ఆధారాలు లేకుండా ఎవరిని అరెస్ట్ చేయబోమని తేల్చి చెప్పడం గమనార్హం.