న్యూయార్క్ : అమెరికాలో ఓ ఇంటి బయట పార్క్ చేసిన కారులోకి ఎక్కేందుకు ప్రయత్నించిన ఎలుగు బంటి వీడియో (viral video) ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. ఎలుగుబంటి కారులోకి ఎంటరయ్యేందుకు ప్రయత్నించగా అటుగా వెళుతున్న వారు కేకలు వేయడంతో భయపడిన జంతువు పొదల్లోకి పారిపోయింది.
ఈ వీడియోను ఇన్‌స్టాగ్రాంలో ప్యుబిటీ షేర్ చేయగా ఇప్పటివరకూ 1.3 కోట్ల మంది వీక్షించారు. ఈ వీడియోలో ఎలుగుబంటి కారు వద్దకు నడుచుకుంటూ వచ్చి కారు డోర్‌ను ఓపెన్ చేస్తుంది. విండో నుంచి దీన్ని గమనిస్తున్న కుటుంబ సభ్యులు పెద్దగా అరవడం, స్దానికులు కేకలు వేయడంతో భయపడిన జంతువు వెనక్కు మళ్లడం చూడొచ్చు. జంతువు ముఖంలో కన్ఫ్యూజన్ స్పష్టంగా కనిపించింది. ఈ వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
Read More