బిజినెస్ టైకూన్ ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఆయన సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటారో అందరికీ తెలుసు. తన ట్విట్టర్లో ఫన్నీ వీడియోలు, సందేశాత్మక వీడియోలు షేర్ చేస్తూ ఎప్పుడూ సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్‌గా నిలుస్తుంటారు ఆనంద్ మహీంద్రా. ఆయన షేర్ చేసే వీడియోలపై నెటిజన్లు కూడా తమదైన శైలిలో స్పందిస్తుంటారు.
తాజాగా ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన వీడియో కూడా ఆలోచనాత్మకమైనదే. ఢిల్లీకి చెందిన అలగ్ నటరాజన్ అనే వ్యక్తి గురించి ఆయన పోస్ట్ చేశారు. నటరాజన్‌కు మట్కా మ్యాన్ అనే పేరు కూడా ఉంది. ఢిల్లీలోని చాలా ప్రాంతాలకు ఈ మట్కా మ్యాన్ ఉచితంగా మంచి నీరును రోజూ అందిస్తాడు.
ఎక్కడైతే మంచినీటికి కటకట ఉంటుందో అక్కడికి వెళ్లి మట్కా మ్యాన్ ఉచితంగా నీటిని అందిస్తాడు. దాని కోసం సపరేట్గా బొలెరో వాహనం వెనుక వాటర్ ట్యాంకర్, ప్యూరిఫైర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ ట్యాంకర్లో 1000 లీటర్ల నీటిని నింపి ప్రజలకు ఉచితంగా అందిస్తాడు.
నటరాజన్ ఒక ఎంట్రీప్రెన్యూర్. ఇంగ్లండ్‌లో చాలా కాలం ఉండి.. క్యాన్సర్‌ను జయించి ఇండియాకు తిరిగి వచ్చి.. ఇలా తనకు తోచిన సాయం చేస్తున్నాడు. మంచి నీరు దొరకని వాళ్లకు ఉచితంగా స్వచ్ఛమైన ప్యూరిఫైడ్ మంచినీటిని అందించి టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యాడు.
A Superhero that’s more powerful than the entire Marvel stable. MatkaMan. Apparently he was an entrepreneur in England & a cancer conqueror who returned to India to quietly serve the poor. Thank you Sir, for honouring the Bolero by making it a part of your noble work. 🙏🏽 pic.twitter.com/jXVKo048by
— anand mahindra (@anandmahindra) October 24, 2021
ఆయన చేస్తున్న మంచి పనిని మెచ్చిన ఆనంద్ మహీంద్రా ఆయనకు హేట్సాఫ్ చెప్పారు. సూపర్ హీరో అంటూ పొగిడారు. ఒక మంచి పని కోసం మహీంద్రా బొలెరో వాహనాన్ని వాడినందుకు ఆనంద్.. మట్కా మ్యాన్‌కు ధన్యవాదాలు తెలిపాడు. ప్రస్తుం మట్కా మ్యాన్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా మట్కా మ్యాన్‌ను ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు.
I salute to #matkaman for this nobel act of kindness. I am also thankful to @anandmahindra sir increasing knowledge with such type of nobel work. I think our generations will learn our culture from such type of post in this materialistic world.
— ANUJIT KULSHRESTHA (@anujitkulshrest) October 24, 2021
Thank you for highlighting such kind of real heroes. Must take a lot of effort to research and publish. You are a hero yourself, sir. #respect 🙏🏼 #JaiHind 🇮🇳
— Ash Agarwal (@Ash3108) October 24, 2021
A ROARING Applause to this GOLDENHEART Hero . pic.twitter.com/GmAUx1Bqj0
— Kaushik Roy (@LIFE_IS_JHAKKAS) October 24, 2021
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Spider inside Woman’s Ear : మహిళ చెవిలో దూరిన సాలీడు..
70 ఏళ్ల వయసులో పండంటి బిడ్డకు జన్మనిచ్చిన వృద్ధురాలు..
Viral Video : ప్రపంచంలోనే అత్యంత పెద్ద పాము.. దీన్ని మోయడానికి క్రేన్‌నే తీసుకొచ్చారు
Driverless bike : డ్రైవర్‌లెస్ బైక్ వచ్చేసింది.. ఆనంద్ మహీంద్రా షేర్ చేసిన ఈ వీడియో చూశారా?
విమానం నుంచి పడిపోయిన మానవ వ్యర్థాలు.. షాకైన తోట యజమాని