నిగనిగలాడుతున్న ఓ భారీ పామును.. రెండేండ్ల బుడ్డోడు ఏ మాత్రం భయపడకుండా పట్టుకుని అందర్నీ ఆశ్చర్యపరిచాడు. పామును లాగడమే కాదు.. దాంతో కాసేపు ఆటాడేందుకు యత్నించాడు.
ఆస్ట్రేలియాకు చెందిన మ్యాట్ వ్రిట్ అనే వ్యక్తి గత 20 ఏండ్ల నుంచి పాములు పడుతున్నాడు. అయితే మ్యాట్ ఇంటి ఆవరణలోకి ఆరు అడుగుల పొడవున్న ఓ పాము వచ్చింది. ఈ పామును చూసిన మ్యాట్ కుమారుడు(2) సంబురపడుతూ దాన్ని తోకను పట్టుకున్నాడు. అంతేకాదు ఆ పామును వెనక్కి లాగుతూ ఎంజాయ్ చేశాడు. తోకను విడిచి పాము తల భాగం వద్దకు వెళ్లి పట్టుకునేందుకు యత్నించాడు. తండ్రికి పాములు పట్టే నైపుణ్యం ఉండటంతో.. ఆ బాలుడు ఎలాంటి భయం లేకుండా పాముతో కాసేపు ఆటాడాడు. ఇక పాములను ఎలా పట్టాలో ఆ పిల్లాడికి తండ్రి మెళకువలు నేర్పాడు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.