Viral Video | ఐదేళ్లు జైలు శిక్ష అనుభవించిన ఓ ఖైదీకి జైలు అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రామ్ సూరత్ అనే 98 వృద్ధుడు పలు కేసుల్లో దోషిగా తేలడంతో కోర్టు అతనికి ఐదేళ్లు జైలు శిక్ష విధించింది. ఈ మేరకు అతను అయోధ్య జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. కాగా, శిక్ష అనంతరం అతను ఇటీవల విడుదలయ్యాడు.
జైలు సూపరింటెండెంట్ శశికాంత్ మిశ్ర.. సూరత్‌కు ఘనంగా వీడ్కోలు పలికాడు. అనంతరం కారు ఇచ్చి మరీ ఇంటికి చేర్చాడు. వాస్తవానికి సూరత్ గతేడాది ఆగస్టు 8న విడుదల కావాల్సి ఉంది. కానీ మే 20న అతనికి కొవిడ్ నిర్ధారణ కావడంతో 90 రోజులు పెరోల్‌పై ఉన్నారు. ఈ మేరకు తాజాగా అతను విడుదలయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ఉత్తరప్రదేశ్ జైళ్ల శాఖ డీజీ ట్విట్టర్లో పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతోంది.
परहित सरिस धर्म नहीं भाई . 98 वर्षीय श्री रामसूरत जी की रिहाई पर लेने कोई नहीं आया . अधीक्षक जिला जेल अयोध्या श्री शशिकांत मिश्र पुत्रवत अपनी गाड़ी से घर भेजते हुए . @rashtrapatibhvn @narendramodi @myogiadityanath @dharmindia51 pic.twitter.com/qesldPhwBB
— DG PRISONS U.P (@DgPrisons) January 8, 2023