ఎండలు మండిపోతున్నాయి. జనాలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఏసీలు, కూలర్లు లేనిదే ఇళ్లలో ఉండలేని పరిస్థితి. భానుడి ప్రతాపానికి మధ్యాహ్నంపూట రోడ్లపై జనాలు కనిపించడంలేదు. చాలా మంది శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి కార్బొనేటెడ్ డ్రింక్స్, ఆమ్ పన్నా, ఐస్క్రీమ్ తీసుకుంటున్నారు. కొందరు ఇతర పద్ధతులను ఆశ్రయిస్తారు. చాలా అరుదుగా ప్రజలు వేసవి వేడిని అధిగమించడానికి యోగా వైపు మొగ్గు చూపుతున్నారు. కాగా, బాలీవుడ్ నటి మలైకా అరోరా శరీరాన్ని చల్లగా ఉంచి, కేలరీలను బర్న్ చేసే మూడు యోగా భంగిమలతో మన ముందుకొచ్చారు. ఈ మూడు భంగిమలను ఇన్స్టాలో పెట్టారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
1.పావురం భంగిమ (పీజన్ పోజ్)
2. పిల్లి -ఆవు భంగిమ (క్యాట్ అండ్ కౌ పోజ్)
3.చెట్టు భంగిమ (ట్రీ పోజ్)
పావురం భంగిమ వల్ల కలిగే ప్రయోజనాలు..
పావురం భంగిమ.. ముందు శరీరం, ఛాతీ, గొంతు, చీలమండలు, తొడలు, గజ్జలు, లోతైన హిప్ ఫ్లెక్సర్లను సాగదీయడం ద్వారా వెనుక కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. ఇది మెడ, పొత్తికడుపును కూడా ఉత్తేజపరుస్తుంది. రక్తపోటు, మైగ్రేన్ లేదా నిద్రలేమి ఉన్న రోగులకు ఈ భంగిమ ప్రయోజనకరంగా ఉంటుంది. వెన్ను సమస్యలు లేదా గాయాలు ఉన్న వ్యక్తులు ఈ భంగిమ వేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. వైద్యుడిని సంప్రదించిన తర్వాతే ఈ ఆసనం ట్రై చేస్తే బెటర్. ఖాళీ కడుపుతో దీన్ని ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయాలి.
పిల్లి-ఆవు భంగిమ ఆరోగ్య ప్రయోజనాలు..
చక్రవక్రాసన లేదా పిల్లి-ఆవు స్ట్రెచ్ అని కూడా పిలుస్తారు. ఈ ఆసనం ఉద, వెన్నెముక ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది వెన్నెముకను గుండ్రని స్థానం నుంచి వంపు భంగిమకు తరలిస్తుంది. ఈ భంగిమ వెన్నునొప్పికి చికిత్స చేయడం, తగ్గించడంతోపాటు వెన్నెముకను ఆరోగ్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. కంప్యూటర్ స్క్రీన్ ముందు ఎక్కువ గంటలు పని చేసే వారికి ఇది తప్పనిసరి. ఈ భంగిమ ఒత్తిడి స్థాయిలను తగ్గించడం, శరీర సమతుల్యతను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.
ట్రీ పోజ్ ఆరోగ్య ప్రయోజనాలు..
చెట్టు భంగిమ లేదా ట్రీ పోజ్ అనేది శరీరం, మనస్సు మధ్య సమతుల్యతను సాధించడంలో సహాయపడుతుంది. ఇది కాళ్లను బలపరుస్తుంది. తుంటిని తెరుస్తుంది.పెల్విక్ స్థిరత్వాన్ని పెంచుతుంది. నిద్రలేమి, మైగ్రేన్ లేదా వెర్టిగో ఉన్నవారు ఈ భంగిమ వేయవద్దు.