Karthika Masam Special | పర్యాటకులకు ఐఆర్సీటీసీ గుడ్‌న్యూస్..! భారత్ గౌరవ్ రైలులో తొమ్మిదిరోజుల కార్తీకమాసం స్పెషల్ దివ్యదక్షిణ యాత్ర..!
Karthika Masam Special | ఈ ఏడాది అక్టోబర్ 23వ తేదీ నుంచి కార్తీక మాసం (Karthika Masam) ప్రారంభంకానున్నది. ఎంతో పవిత్రమైన కార్తీకమాసంలో పలు ఆలయాలను దర్శించుకోవాలని పలువురు భావిస్తుంటారు. ముఖ్యంగా శివాలయాలను దర్శించుకోవాలనుకుంటున్నారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుటున్న వారికి ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
Karthika Masam Special | ఈ ఏడాది అక్టోబర్ 23వ తేదీ నుంచి కార్తీక మాసం (Karthika Masam) ప్రారంభంకానున్నది. ఎంతో పవిత్రమైన కార్తీకమాసంలో పలు ఆలయాలను దర్శించుకోవాలని పలువురు భావిస్తుంటారు. ముఖ్యంగా శివాలయాలను దర్శించుకోవాలనుకుంటున్నారు. పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలనుకుటున్న వారికి ఐఆర్సీటీసీ టూరిజం (IRCTC Tourism) ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది. దివ్యదక్షిణ యాత్ర విత్ జ్యోతిర్లంగ యాత్ర (Divya Dakshin Yatra) పేరుతో స్పెషల్ టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. ఈ ప్యాకేజీలో ప్రయాణం నవంబర్ 6న ప్రారంభం కానున్నది. టూర్ ప్యాకేజీలో తొమ్మిదిరోజులు, ఎనిమిది రాత్రుల పాటు పర్యటన కొనసాగుతున్నది.
ప్యాకేజీలో తిరువణ్ణామలైలోని అరుణాచలం, రామేశ్వరంలోని రామేశ్వరస్వామి, మధురైలో మీనాక్షి అమ్మవారు, కన్యాకుమారిలో రాక్ మెమోరియల్, కుమారి అమ్మన్ ఆలయం, త్రివేండ్రంలో అనంతపద్మనాభ స్వామి ఆలయం, తిరుచ్చిలో రంగనాథస్వామి, తంజావూరులోని బృహదీశ్వర ఆలయాలను సందర్శించేందుకు అవకాశం కల్పిస్తున్నది. ఈ టూర్ ప్యాకేజీలో పర్యటన హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. భువనగిరి, జనగాం, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్ జంక్షన్, ఖమ్మం, మదిర, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగులో, కావలి, నెల్లూరు, గూడురు, రేణిగుంట స్టేషన్లలోనూ రైలు ఆగుతుంది. ఇక పర్యటన భారత్ గౌరవ్ టూరిజం రైలులో కొనసాగుతుంది.
పర్యటన కొనసాగేదిలా..
కార్తీక మాసం ప్రత్యేక దివ్య దక్షిణ్ యాత్ర తొలిరోజు నవంబర్ 6న సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మొదలువుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు పర్యాణికులు భారత్ గౌరవ్ రైలులో మొదలవుతుంది. మధ్యాహ్నం ఒంటిగంటకు బోనగిరికి చేరుతుంది. రోజురోజు వేకువ జామున 1.20గంటలకు కావలి రైల్వేస్టేషన్‌కు రైలు వెళ్తుంది. ఉదయం 7.30 గంటలకు తిరువణ్ణామలై చేరుతుంది. ఆ తర్వాత హోటల్‌కు చేరుకొని దర్శనాలు పూర్తి చేసుకుంటారు. రాత్రి 10గంటలకు స్టేషన్‌కు చేరుకొని రామేశ్వరానికి ప్రయాణమవుతారు. మూడోరోజు ఉదయం 6.30 గంటలకు కుడాల్‌నగర్ స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గం ద్వారా రామేశ్వరం చేరుకుంటారు. రామేశ్వర స్వామి దర్శనంతో పాటు ఇతర పర్యాటక ప్రాంతాలకు వీక్షించేందుకు వెళ్తారు. రాత్రి రామేశ్వరంలోనే బస ఉంటుంది. నాలుగో బస్సు ద్వారా మధురైకి బయలుదేరుతారు.
అక్కడ మీనాక్షి అమ్మవారి ఆలయంలో దర్శనాలు చేసుకుంటారు. సాయంత్రం వరకు షాపింగ్ చేసుకోవచ్చు. రాత్రి 11.30గంటలకు కన్యాకుమారికి వెళ్లేందుకు కుడాల్‌నగర్ రైల్వేస్టేషన్‌కు వెళ్తారు. ఐదోరోజు కన్యాకుమారి చేరుకొని హోటల్‌కు వెళ్తారు. ఆ తర్వాత రాక్ మెమోరియల్, గాంధీ మండపం, సన్‌సెట్ పాయింట్‌ని సందర్శిస్తారు. రాత్రికి కన్యాకుమారిలోనే బస ఉంటుంది. ఆరో రోజు కన్యాకుమారి నుంచి కొచ్వెల్లి చేరుకొని త్రివేండ్రం చేరుకొని అనంత పద్మనాభ స్వామి దర్శనానికి వెళ్తారు. ఆ తర్వాత కొచ్వెల్లికి చేరుకొని తిరుచిరాపల్లికి వెళ్తారు. ఏడో రోజు శ్రీరంగం చేరుకొని ఆలయానికి వెళ్తారు. లంచ్ చేసుకొని 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న తంజావూరుకి వెళ్తారు. అక్కడ బృహదీశ్వర ఆలయాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత తిరుగు ప్రయాణమవుతారు. ఎనిమిదో రోజు ఉదయం 8 గంటలకు రేణికుంట చేరుతారు. తొమ్మిదో రోజు వేకువ జామున 2.30గంటలకు సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.
మూడు కేటగిరిలు.. ప్యాకేజీ ధరలు ఇవే..
ఈ కార్తీక మాసం స్పెషల్ టూర్ ప్యాకేజీని మూడు కేటగిరిల్లో ఐఆర్సీటీసీ అందిస్తున్నది. స్లీపర్, థర్డ్ ఏసీ, సెకండ్ ఏసీ కేటగిరిలో అందుబాటులో ఉన్నాయి. స్లీపర్ కేటగిరికి రూ.14,250, థర్డ్ ఏసీకి రూ.21,900, సెకండ్ ఏసీకి రూ.28,450 చెల్లించాల్సి ఉంటుంది. ప్యాకేజీలో రైలు టికెట్, హోటల్లో బస, బస్సు సౌకర్యం ఉంటుంది. అలాగే మార్నింగ్ టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ కవర్ అవుతాయి. ఇక పర్యాటకులందరికీ ఇన్సురెన్స్ ఉంటుంది. స్లీపర్ కేటగిరిలోని పర్యాటకులకు నాన్ ఏసీ గదుల్లో వసతి ఉంటుంది. అలాగే, నాన్ ఏసీ వాహనాల్లో ప్రయాణం ఉంటుంది. థర్డ్ ఏసీలోని వారికి ఏసీ గదుల్లో వసతి, నాన్ ఏసీ వాహనాల్లో ప్రయాణం కల్పిస్తారు. కంఫర్ట్ కేటగిరిలోని అందరికీ ఏసీ గదుల్లో వసతి, ఏసీ వాహనంలో ప్రయాణం కల్పిస్తారు. ప్యాకేజీలో బుక్ చేసుకునేందుకు irctctourism.com వెబ్సైట్లో సంప్రదించాలని ఐఆర్సీటీసీ కోరింది. లేకపోతే సికింద్రాబాద్ జోనల్ కార్యాలయం, విజయవాడ, తిరుపతి, విశాఖపట్నంలోని రైల్వేస్టేషన్లలోని కార్యాలయాల్లో సంప్రదించాలని విజ్ఞప్తి చేసింది.
Read Also :
Special Trains | కాజీపేట మీదుగా మహబూబ్‌నగర్ – గోరక్‌పూర్ మధ్య ప్రత్యేక రైళ్లు..!
IPL 2025 | ద్రవిడ్‌కు తోడుగా అతడు.. మళ్లీ హిట్ కొడుతారా..?
Read Today's Latest Tourism News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్‌కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

