Special Trains | దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. గోరక్‌పూర్ – మహబూబ్‌నగర్ మధ్య ప్రస్తుతం నడుస్తున్న ప్రత్యేక రైళ్లను అక్టోబర్‌లో నడిపిస్తున్నట్లు పేర్కొంది. గోరక్‌పూర్ – మహబూబ్‌నగర్ (05303) మధ్య అక్టోబర్ 12, 19, 26 మధ్య ప్రతి శనివారం ప్రత్యేక రైళ్లు రాకపోకలు సాగిస్తాయని చెప్పింది. ఇక మహబూబ్‌నగర్ – గోరక్‌పూర్ (05304) మధ్య అక్టోబర్ 13, 20, 27 తేదీల్లో ప్రత్యేక రైళ్లు నడుస్తాయని పేర్కొంది. ప్రస్తుతం కొనసాగుతున్న రద్దీని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేక రైళ్లను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. రైలు జడ్చర్ల, షాద్‌నగర్, ఉమ్దానగర్, కాచిగూడ, మల్కాజ్గిరి, రామగుండం, బెల్లంపల్లి, నాగ్‌పూర్, ఇటార్సీ, భోపాల్, ఝాన్సీ, ఒరై, కాన్పూర్ సెంట్రల్, ఐష్బాగ్, బస్తీ స్టేషన్ల మీదుగా గోరక్‌పూర్‌కు రైలు చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. ప్రయాణికులు
ప్రత్యేక రైళ్లను వినియోగించుకోవాలని కోరింది.
Read Also :
YS Jagan | తిరుమలలో కల్తీ నెయ్యి వ్యవహారం కట్టు కథ : వైఎస్ జగన్ వెల్లడి
Tirumala Laddu | లడ్డూలో కల్తీ జరిగింది వాస్తవమే… టీటీడీ ఈవో ఏమన్నారంటే..?