e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, November 29, 2021
Home News The great resignation | అగ్ర‌దేశాల‌ను భ‌య‌పెడుతున్న ది గ్రేట్ రిజిగ్నేష‌న్‌.. చైనాలో ఏమో బాయ్‌కాట్ 996

The great resignation | అగ్ర‌దేశాల‌ను భ‌య‌పెడుతున్న ది గ్రేట్ రిజిగ్నేష‌న్‌.. చైనాలో ఏమో బాయ్‌కాట్ 996

The great resignation and boycott 996 | కరోనా సంక్షోభం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న అమెరికా, ఐరోపా దేశాలను ఉద్యోగ సంక్షోభం భయపెడుతున్నది. అదే ‘ ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌ ( the great resignation )’. ‘లక్షల్లో వేతనం ఇస్తాం. సకల సౌకర్యాలు కల్పిస్తా’మని కంపెనీలు ఆఫర్లు ఇస్తున్నప్పటికీ, ఉద్యోగులు విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే?

the great resignation | boycott 996 | ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌ | బాయ్‌కాట్‌ 996

ఏమిటీ ‘ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌ ( the great resignation )‘?

కరోనా కష్ట సమయంలో తమను నట్టేట ముంచిన కంపెనీల్లో తిరిగి చేరేందుకు ఉద్యోగులు ఇప్పుడు సిద్ధంగా లేరు. ఆకర్షణీయ వేతనాలు, ప్యాకేజీలు ఇస్తామని ప్రకటించినప్పటికీ.. వాళ్ల వైఖరి మారడంలేదు. అదే ‘ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌’ సంక్షోభానికి దారితీసింది. గడిచిన ఒకటిన్నరేండ్లలో ఒక్క అమెరికాలోనే 10.3 శాతంమంది ఉద్యోగులు రాజీనామా చేశారు.

బాయ్‌కాట్‌ 996 | the great resignation

కారణాలు ఏమిటీ?

- Advertisement -

ఏండ్ల తరబడి నమ్మకంగా పని చేసిన ఉద్యోగులను.. కరోనా సంక్షోభం పేరు చెప్పి కొన్ని కంపెనీలు వదిలించుకున్నాయి. మరికొన్ని వేతనాల్లో కోత విధించాయి. ఏడాది గడిచింది. వైరస్‌ ఉద్ధృతి తగ్గి వ్యాపారాలు మళ్లీ పుంజుకున్నాయి. అయితే, కష్టకాలంలో ఆదుకోని కంపెనీల వృద్ధికి ఇకపై తాము సాయపడబోమని ఎక్కువ మంది ఉద్యోగులు నిర్ణయించుకున్నారు. పాత కొలువులకు గుడ్‌బై చెబుతూ.. కొత్త ఉద్యోగాలు లేదా సొంత వ్యాపారాలపై దృష్టి సారిస్తున్నారు.

ఏడాదిన్నర ముందే..

‘ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌’ అనే పదాన్ని తొలిసారిగా 2019లో టెక్సాస్‌లోని ఏ అండ్‌ ఎం యూనివర్సిటీ ప్రొఫెసర్‌ ఆంటోనీ క్లాట్జ్‌ ప్రయోగించారు. మహమ్మారి ఉద్ధృతి తగ్గిన తర్వాత కోట్ల సంఖ్యలో ఉద్యోగులు తమ కొలువులకు రాజీనామా చేస్తారని ఆయన ముందుగానే అంచనా వేశారు. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతున్నది.

ఏ రంగాల్లో ఎక్కువ అంటే?

రెస్టారెంట్లు, హెల్త్‌కేర్‌, రిటైల్‌, గోదాములు, సేవల రంగాల్లో ‘ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌’ ప్రభావం ఎక్కువగా ఉన్నది. తక్కువ వేతనాలకు పనిచేస్తున్నవారితో పాటు ఉన్నతస్థాయి ఉద్యోగాల్లో ఉన్నవారు కూడా ‘ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌’లో భాగమవుతున్నారు.

996 వర్క్‌ కల్చర్‌పై చైనీయుల గరం

పాశ్చాత్య దేశాలను ఒకవైపు ‘ది గ్రేట్‌ రిజిగ్నేషన్‌’ సంక్షోభం కుదిపేస్తుంటే.. చైనాలో ‘996 వర్క్‌ కల్చర్‌ ( 996 work culture )’కు వ్యతిరేకంగా ‘బాయ్‌కాట్‌ 996’ ఆన్‌లైన్‌ ఉద్యమం మొదలైంది. ఓవర్‌టైం పనివేళలు, సెలవుల విషయంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న టెక్‌ నిపుణులు.. తాము పని చేస్తున్న కంపెనీలో పనివేళల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపరుస్తూ ఏకంగా ఓ డేటాబేస్‌నే రూపొందిస్తున్నారు. ఈ ఉద్యమం 2019లో తొలుత వెలుగుచూసినప్పటికీ, ప్రస్తుతం పెద్దఎత్తున కొనసాగుతున్నది.

ఏమిటీ ‘బాయ్‌కాట్‌ 996 ( boycott 996 )’?

ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు, వారానికి 6 రోజులు చైనాలోని ఉద్యోగులు విధులు నిర్వర్తిస్తున్నారని సూచించే సంఖ్యే ‘996’. అయితే పనివేళలు, పనిభారం ఎక్కువ కావడంతో బాయ్‌కాట్‌ 996 ( Boycott 996 ) ఉద్యమాన్ని అక్కడి ఉద్యోగులు మొదలుపెట్టారు. ‘996.. స్థానంలో 955(ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పని వేళలు.. వారానికి ఐదు రోజుల పనిదినాలు)ని తీసుకురావాలని కంపెనీలను డిమాండ్‌ చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి..

ఆ ఉల్లిగ‌డ్డ‌ల‌ను తిని జ‌నాలు ఎందుకు జ‌బ్బుప‌డుతున్నారు? వాటిలో ఏముంది?

Bank Locker | బ్యాంకులో లాక‌ర్ తెరిచారా.. ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

ట్రెయిన్‌లో లోయ‌ర్ బెర్త్ టికెట్ క‌న్ఫ‌మ్‌ కావాలంటే ఏం చేయాలి? ఇదిగో ట్రిక్‌

Korean Women : కొరియ‌న్ మ‌హిళ‌లు అస్స‌లు లావెక్క‌రు తెలుసా? వాళ్ల ఫిట్‌నెస్ ర‌హ‌స్యం ఏంటి?

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement