Salmonella Infected Onions : ఆ ఉల్లిగడ్డలను తిని జనాలు ఎందుకు జబ్బుపడుతున్నారు? వాటిలో ఏముంది?
ఆ ఉల్లిగడ్డలను తిని జనాలు ఎందుకు జబ్బుపడుతున్నారు? | ఉల్లిగడ్డలను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది అని పెద్దలు చెబుతుంటారు. ఉల్లి చేసే మేలు
ఉల్లిగడ్డలను తినడం ఆరోగ్యానికి ఎంతో మంచిది అని పెద్దలు చెబుతుంటారు. ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదంటారు. కానీ.. ప్రస్తుతం ఆ ఉల్లిగడ్డలను తినడం వల్లనే చాలామంది వ్యాధి బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు ఉల్లిగడ్డలను తినడం వల్ల యూఎస్ఏలోని 37 రాష్ట్రాల్లో 652 మందికి పలు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అందులో 129 మంది ఆసుపత్రి పాలయ్యారు. దానికి కారణం వాళ్లు తిన్నది సాల్మానెల్లా అనే బ్యాక్టీరియా ఉన్న ఉల్లిగడ్డలను తినడం. ఆ ఉల్లిగడ్డలను మెక్సికో నుంచి యూఎస్‌కు ఇంపోర్ట్ చేశారు. వాటిని తిని ఇప్పటి వరకు ఎవరూ చనిపోలేదు కానీ.. ఆసుపత్రుల పాలు అవడం.. పలు ఆరోగ్య సమస్యలకు గురి కావడంతో యూఎస్‌లో ఉల్లిగడ్డలను తినాలంటే అక్కడి ప్రజలు వణికిపోతున్నారు.

అసలు సాల్మానెల్లా అంటే ఏంటి?
సాల్మానెల్లా అనేది ఓ బ్యాక్టీరియా. అది ఎక్కువగా ఆహార పదార్థాల్లో ఉంటుంది. వాటిని తినగానే ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ బ్యాక్టీరియా ఉన్న ఫుడ్‌ను తీసుకోగానే పేగుల్లో సమస్యలు వస్తాయి. తద్వారా కడుపు నొప్పి వస్తుంది. ఈ బ్యాక్టీరియా ద్వారా ఆరోగ్య సమస్యలు వస్తే వాటిని సాల్మోనెల్లోసిస్ అని అంటారు.
ఈ రకం బ్యాక్టీరియా ఎక్కువగా జంతువుల్లో, మనిషి పేగుల్లో ఉంటుంది. ఈ బ్యాక్టీరియా మల విసర్జన ద్వారా బయటికి వెళ్లి ఆహార పదార్థాల్లో, నీళ్లలో కలిసి పోయి.. తిరిగి మనుషుల్లోకి చేరుతుంది. ఈ బ్యాక్టీరియా మనుషుల్లోకి చేరిందని తెలుసుకోవడం చాలా కష్టం.

ఈ బ్యాక్టీరియాతో ఇన్ఫెక్ట్ అయితే వాంతులు అవడం, డయోరియా, జ్వరం, తలనొప్పి, కడుపు నొప్పి లాంటి లక్షణాలు కనిపిస్తాయి. 5 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలు.. 65 సంవత్సరాల కంటే ఎక్కువ వయసు ఉన్న పెద్దలకు ఈ బ్యాక్టీరియా సోకే ప్రమాదం ఎక్కువ.
ఈ బ్యాక్టీరియా రక్త ప్రవాహంలో కలిస్తే మాత్రం చాలా ప్రమాదం. అది మెదడులోని కణజాలాన్ని, వెన్నుముకను డ్యామేజ్ చేస్తుంది. రక్తనాళాలపై కూడా ప్రభావం చూపిస్తుంది. పైన చెప్పిన లక్షణాలు ఉంటే వెంటనే ఆసుపత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలి.
అయితే.. ఉల్లిగడ్డల్లో ఈ బ్యాక్టీరియా ఎలా కలుషితం అయిందో తెలుసుకునే పనిలో పడ్డారు యూఎస్ అధికారులు. ఉల్లిగడ్డల హార్వెస్టింగ్ తర్వాత వాటిని గోదాముల్లో దాచే సమయాల్లోనే సాల్మెనెల్లా బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. లేదంటే ఉల్లిగడ్డ సాగు సమయంలో కలుషితమైన నీటితో లేదా పేడ లాంటి ఎరువును వాడటం వల్ల సాల్మెనెల్లా ఉల్లిగడ్డలకు సోకి ఉంటుందని అనుమానిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
Health tips : ఈ పండుతో ఆరోగ్య ప్రయోజనాలు మెండు!
Allergies : శీతాకాలంలో వేధించే అలర్జీలు.. ఇలా చెక్ పొట్టొచ్చు!
Heart Attack and Banana : ఈ పండు రోజూ తింటే హార్ట్ అటాక్ రాదంట..! ఆక్స్ఫర్డ్ పరిశోధకుల వెల్లడి
Smart Bandage : గాయాల గురించి చెప్పే స్మార్ట్ బ్యాండేజ్ వచ్చేసింది..!
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
బేబీ బ్లూ ఐస్ ఫ్లవర్స్.. వెరీ వెరీ నైస్ నేచర్!
బస్‌పాస్ పోతే మళ్లీ డబ్బులే!
బీఎస్సీ ఉద్యాన కోర్సులో ప్రవేశాలకు 30న చివరి విడత కౌన్సెలింగ్
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

