కరోనాతో మాజీ మంత్రి కన్నుమూత
మాజీ మంత్రి| మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎక్నాథ్ గైక్వాడ్ కరోనాతో మృతిచెందారు. కరోనా బారినపడిన ఆయన ముంబైలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు.

ముంబై: కరోనాతో రాజకీయ ప్రముఖులు బలవుతున్నారు. తాజాగా మహారాష్ట్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ ఎక్నాథ్ గైక్వాడ్ కరోనాతో మృతిచెందారు. కరోనా బారినపడిన ఆయన ముంబైలోని ఓ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో బుధవారం ఉదయం 10 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన కూతురు వర్షా గౌక్వాడ్ ప్రస్తుతం మహారాష్ట్ర ప్రస్తుత విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్నారు.

ముంబై సౌత్ సెంట్రల్ నియోజకర్గం నుంచి ఏక్నాథ్ గైక్వాడ్ రెండుసార్లు ఎంపీగా గెలుపొందారు. 2014లో జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూశారు. ఆసియాలో అతిపెద్ద మురికివాడ అయిన ధారావి నియోజకవర్గం ఎమ్మెల్యేగా 1985 నుంచి వరుసగా మూడుసార్లు గెలుపొందారు. రెండుసార్లు రాష్ట్ర మంత్రిగా పనిచేశారు. ముంబై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..
కీలక నిర్ణయం.. ఆ దేశంలో బుర్ఖాపై నిషేధం
దేశంలో 2 లక్షలు దాటిన కరోనా మరణాలు
ఇండియన్ రెడ్ క్రాస్‌కు కెనడా ఆర్థిక సాయం..!
అల్లు అర్జున్‌కు కరోనా పాజిటివ్..!
నోస్టాక్ బోర్డు.. అయినా టీకా కోసం బారులుతీరిన జనం
రెమ్‌డెసివిర్ కోసం సీఎంవో కాళ్లుమొక్కిన కుటుంబం.. వీడియో
మహారాష్ర్టలో ఎన్కౌంటర్.. ఇద్దరు నక్సల్స్ హతం
Read Today's Latest Topstories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

