కీలక నిర్ణయం.. ఆ దేశంలో బుర్ఖాపై నిషేధం
బుర్ఖాపై నిషేధం | జాతీయ భద్రత దృష్ట్యా శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా ధరించడంపై నిషేధం విధించింది.

కొలంబో : జాతీయ భద్రత దృష్ట్యా శ్రీలంక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా ధరించడంపై నిషేధం విధించింది. అయితే కరోనా తీవ్రత దృష్ట్యా మాస్కులు ధరించొచ్చు కానీ, బుర్ఖాలు మాత్రం ధరించరాదు అని స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖా ధరించడంపై నిషేధం విధించిన బిల్లుకు శ్రీలంక కేబినెట్ మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లును శ్రీలంక పార్లమెంట్ ఆమోదించగానే చట్టరూపంలోకి రానుంది.
2019లో ఈస్టర్ సందర్భంగా చర్చిలు, హోటళ్లపై ఉగ్రవాదులు బుర్ఖా ధరించి దాడులు చేసిన నేపథ్యంలో, జాతీయ భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేబినెట్ తెలిపింది. శ్రీలంకలో బహిరంగ ప్రదేశాల్లో బుర్ఖాలు ధరించడంపై నిషేధం విధించడాన్ని పాకిస్తాన్ హై కమిషనర్ తీవ్రంగా తప్పుబట్టింది. ముస్లింల మనోభావాలను దెబ్బతీసేందుకే ఈ నిర్ణయం తీసుకుని, జాతీయ భద్రత దృష్ట్యా విభజన చర్యలు సృష్టిస్తున్నారని పేర్కొంది. శ్రీలంకలో ముస్లింల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నారని మండిపడింది.
2019లో ఈస్టర్ రోజున నేషనల్ తావీద్ జమాత్ ఆత్మాహుతి దళానికి చెందిన 9 మంది ఉగ్రవాదులు బుర్ఖా ధరించి చర్చిలు, హోటళ్లపై పేలుళ్లకు పాల్పడటంతో 270 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 11 మంది భారతీయులు కూడా ఉన్నారు. ఈ దాడుల్లో 500 మందికి పైగా గాయపడ్డారు.
ఇవికూడా చదవండి..
ఇండియన్ రెడ్ క్రాస్‌కు కెనడా ఆర్థిక సాయం..!
ఆ 8 రాష్ర్టాలు, యూటీల్లో కరోనా మరణాలు లేవు
అసోంకు అండగా ఉంటాం : ప్రధాని మోదీ
దేశంలో 2 లక్షలు దాటిన కరోనా మరణాలు
దవాఖానలో అగ్నిప్రమాదం.. నలుగురు రోగులు మృతి
కరోనా 617 వేరియంట్లపై కొవాగ్జిన్ ప్రభావవంతం : ఆంథోనీ ఫౌసీ
మరణాల్లో పెరుగుదలకు డబుల్ మ్యుటెంట్కు లింక్ లేదు!
భారత్‌కు తక్షణ సహాయం : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
మహారాష్ర్టలో ఎన్కౌంటర్.. ఇద్దరు నక్సల్స్ హతం
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Burqa
- srilanka
- Terror Attacks
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
GLP-1 Medicine | మార్కెట్లో కుప్పలు కుప్పలుగా కల్తీ జీఎల్పీ-1 మందులు.. అమెరికా ఎఫ్‌డీఏ హెచ్చరికలు..
Cult | విశ్వక్ సేన్ ‘కల్ట్’ ఫస్ట్ డే కలెక్షన్లు.. భారీ అంచనాల మధ్య విడుదలై నిరాశపరిచిందా, బ్రేక్ ఈవెన్‌కు ఎంత రావాలంటే?
Conrad Star Hotel: బెంగుళూరు ఫైవ్ స్టార్ హోటల్ స్విమ్మింగ్ పూల్‌లో కరెంట్ షాక్.. ఇద్దరు విదేశీయులు మృతి
Patancheru PS | పటాన్చెరు పీఎస్ నుంచి దొంగలు పరారు..!
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

