ఆ 8 రాష్ర్టాలు, యూటీల్లో కరోనా మరణాలు లేవు
కరోనా మరణాలు | కొన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నప్పటికీ, మరణాల సంఖ్య మాత్రం మంగళవారం నమోదు కాలేదు

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి దేశాన్ని గజగజ వణికిస్తోంది. మహారాష్ర్ట, కేరళ, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, తమిళనాడు రాష్ర్టాల్లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరిగిపోతోంది. ఈ రాష్ర్టాల్లో కరోనా మరణాల సంఖ్య కూడా భారీగానే ఉంది. కానీ కొన్ని రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నప్పటికీ, మరణాల సంఖ్య మాత్రం మంగళవారం నమోదు కాలేదు. దీంతో ఆ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఊపిరి పీల్చుకున్నాయి.
త్రిపుర, మిజోరం, నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, దాద్రా నగర్ హావేలి, లడఖ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవుల్లో కరోనా మరణాలు మంగళవారం నమోదు కాలేదు.
దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 3,60,960 పాజిటివ్ కేసులు నమోదవగా, 3293 మంది మరణించారు. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1,79,97,267కు చేరగా, కరోనా మరణాలు 2,01,187 వద్ద నిలిచాయి. కొత్తగా 2,61,162 మంది కోలుకోవడంతో మొత్తం 1,48,17,371 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. మరో 29,78,709 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 14,78,27,367 మందికి కరోనా టీకా పంపిణీ చేశారు.
మహారాష్ర్ట, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, కర్ణాటక, కేరళ, చత్తీస్‌గఢ్, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, గుజరాత్, రాజస్థాన్ రాష్ర్టాల్లో కొత్త 71.68 శాతం కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో మహారాష్ర్టలో కరోనాతో 895 మంది మరణించారు. కొత్తగా 66,358 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. పంజాబ్‌లో 5,932 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 100 మంది ప్రాణాలు కోల్పోయారు. కర్ణాటకలో 31,830 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 180 మంది మరణించారు. గుజరాత్లో 14,352 పాజిటివ్ కేసులు, 170 మంది మృతి చెందారు.
ఇవికూడా చదవండి..
అసోంకు అండగా ఉంటాం : ప్రధాని మోదీ
దేశంలో 2 లక్షలు దాటిన కరోనా మరణాలు
దవాఖానలో అగ్నిప్రమాదం.. నలుగురు రోగులు మృతి
కరోనా 617 వేరియంట్లపై కొవాగ్జిన్ ప్రభావవంతం : ఆంథోనీ ఫౌసీ
మరణాల్లో పెరుగుదలకు డబుల్ మ్యుటెంట్కు లింక్ లేదు!
భారత్‌కు తక్షణ సహాయం : అమెరికా అధ్యక్షుడు జో బైడెన్
మహారాష్ర్టలో ఎన్కౌంటర్.. ఇద్దరు నక్సల్స్ హతం
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sanjeev Arora: జైలులో సంజీవ్ అరోరా.. లుథియానా వెస్ట్ సీటు కేటాయింపు
నల్లగొండలో ఎలక్ట్రిక్ బస్ డ్రైవర్ల నిరసన
అకాల వర్షానికి తడిసిన ధాన్యం… ఇబ్బందుల్లో రైతులు
Abhijeet Dipke | తమ్ముడిగా భావించి వదిలేయండి.. దిల్జీత్ దోసాంజ్ వివాదానికి అభిజీత్ దిప్కే ఫుల్స్టాప్!
Singur Drinking Water | సింగూరు ప్రత్యామ్నాయ తాగునీటి ఏర్పాట్ల కోసం రూ.120 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

