నాన్‌స్టిక్ పాత్ర‌ల‌ను ఇలా వాడితే మంచిది

429

నాన్‌స్టిక్ పాత్ర‌లపై వంట చేయ‌డం సులువు. ఒక‌సారి వండిన త‌ర్వాత వాటిని క‌డ‌గడం కూడా ఈజీనే. అందుకే చాలామంది మ‌హిళ‌లు నాన్‌స్టిక్ పాత్ర‌ల‌నే ఎంచుకుంటారు. అయితే మామూలు పాత్ర‌ల్లా వీటిని ఇష్టం వ‌చ్చిన‌ట్లు వాడితే మాత్రం త్వ‌ర‌గా పాడైపోతాయి. నాన్‌స్టిక్ పాత్ర‌ల‌పై ఉండే టెప్లాన్ కోటింగ్ పోయి ప‌నికిరాకుండా పోతాయి. అందుకే నాన్‌స్టిక్ పాత్ర‌ల‌ను వాడేట‌ప్పుడు కొన్ని జాగ్ర‌త్త‌లు పాటించాలి. అప్పుడే ఈ పాత్ర‌లు ఎక్కువ కాలం మ‌న్నుతాయి. ఆ జాగ్ర‌త్త‌లేంటో ఒక‌సారి తెలుసుకుందాం.

నాన్‌స్టిక్ పాత్ర‌ల‌ను ఇలా వాడితే మంచిది

– నాన్‌స్టిక్ పాత్ర‌ల‌ను కొన్న స‌మ‌యంలో వాటిపై స్టికర్ ఉంటుంది. ఆ స్టిక‌ర్‌ను నేరుగా పీకేస్తే మొత్తం రాదు. కొద్దిగా గిన్నెకే అతుక్కుపోతుంది. అందుకే దాని స్టిక‌ర్ పీకేసే ముందు స్ట‌వ్‌పై పెట్టి కాసేపు వేడిచేయాలి. ఆ త‌ర్వాత స్టిక‌ర్‌ను పీకేస్తే సులువుగా వ‌చ్చేస్తుంది. ఆ త‌ర్వాత వేడినీళ్ల‌తో శుభ్రం చేసి ఆర‌బెట్టాలి.

నాన్‌స్టిక్ పాత్ర‌ల‌ను ఇలా వాడితే మంచిది

– నాన్‌స్టిక్ పాత్ర‌ల‌ను స‌న్న‌టి మంట‌పై మాత్ర‌మే ఉంచాలి. ఎక్కువ మంట‌పై పెడితే ఆ వేడికి నాన్‌స్టిక్ పాత్ర‌ల‌పై ఉన్న టెప్లాన్ కోటింగ్ పోతుంది. ఎంత త‌క్కువ మంటపై వీటిని ఉప‌యోగిస్తే అంత మంచిది.

నాన్‌స్టిక్ పాత్ర‌ల‌ను ఇలా వాడితే మంచిది

–  నాన్‌స్టిక్ పాత్ర‌ల‌ను ఎప్పుడూ నేరుగా స్ట‌వ్‌పై పెట్ట‌కూడ‌దు. స్ట‌వ్‌పై పెట్టే ముందు.. లేదా పెట్టిన వెంట‌నే కొద్దిగా నూనె పోయాలి.

నాన్‌స్టిక్ పాత్ర‌ల‌ను ఇలా వాడితే మంచిది

– ప్ర‌తి దానికి నాన్‌స్టిక్ పాత్ర‌ల‌పై ఉప‌యోగించ‌కూడ‌దు. ఏవైనా అతుక్కుపోయే కూర‌లు లేదా ఫ్రై క‌ర్రీలు చేసినప్పుడు మాత్ర‌మే వీటిని వాడ‌టం ద్వారా ఎక్కువ కాలం మ‌న్నుతాయి.

నాన్‌స్టిక్ పాత్ర‌ల‌ను ఇలా వాడితే మంచిది

– కూర వండేట‌ప్పుడు క‌ల‌ప‌డానికి ప్లాస్టిక్‌, చెక్క గ‌రిటెల‌ను మాత్ర‌మే వాడాలి. ఇనుము, స్టీల్‌, ఇత్త‌డి, సిల్వ‌ర్ వంటి గ‌రిటెల‌ను వాడ‌కూడ‌దు. వీటిని వాడితే గిన్నెపై గీత‌లు ప‌డే అవ‌కాశం ఉంది.

నాన్‌స్టిక్ పాత్ర‌ల‌ను ఇలా వాడితే మంచిది

–  నాన్‌స్టిక్ పాత్ర‌ల‌ను తోమేట‌ప్పుడు గ‌రుకుగా ఉండే పీచు ఉప‌యోగించ‌వ‌ద్దు. అలాగే జిడ్డు మ‌రక‌లు పోవాల‌ని గ‌ట్టిగా రుద్ద‌కూడ‌దు. దీనివ‌ల్ల గిన్నెల‌పై కోటింగ్ పోయే అవ‌కాశం ఉంది.

నాన్‌స్టిక్ పాత్ర‌ల‌ను ఇలా వాడితే మంచిది

– గిన్నెల‌కు గ‌ట్టిగా అంటుకున్న ప‌దార్థాలు పోవాల‌ని చెంచా, చాకుల‌తో గీక‌కూడ‌దు. అలా చేస్తే గిన్నెల‌పై గీత‌లు ప‌డి తొంద‌ర‌గా పాడ‌వుతాయి. గిన్నెలో నీళ్లు పోసి చాలాసేపు నాన‌నివ్వాలి. ఆ త‌ర్వాత రుద్ది క‌డిగితే సులువుగా శుభ్రమ‌వుతాయి.

నాన్‌స్టిక్ పాత్ర‌ల‌ను ఇలా వాడితే మంచిది

– నాన్‌స్టిక్ పాత్ర‌ల‌ను వంటింట్లోని సెల్ఫ్‌లు లేదా అల్మారాలో పెట్టిన‌ప్పుడు గీత‌లు ప‌డే ప్ర‌మాదం ఉంది. అందుకే వాటిని సెల్ఫ్‌లో కాకుండా, గిన్నెల పెట్టుకునే స్టాండ్‌లో పెట్ట‌డ‌మే మంచిది. దీనివ‌ల్ల గిన్నెలు ఎక్కువ‌కాలం మ‌న్నుతాయి.

నాన్‌స్టిక్ పాత్ర‌ల‌ను ఇలా వాడితే మంచిది

– నాన్‌స్టిక్ పాత్ర‌ల‌ను వాడిన త‌ర్వాత శుభ్రం చేసి, మెత్త‌టి పొడి బ‌ట్ట‌తో తుడిచి భ‌ద్ర‌ప‌ర‌చాలి. దీనివ‌ల్ల గిన్నెలు ఎక్కువ కాలం కొత్త‌విగా పాడ‌వ్వ‌కుండా ఉంటాయి.