బీజేపీ బరితెగింపు

- ఇల్లంతకుంటలో కుట్రకు ప్లాన్
- మంత్రి కాన్వాయ్ అడ్డగింపు
- పోలీస్‌స్టేషన్ వద్ద టీఆర్ఎస్ శ్రేణులపై దౌర్జన్యం
- టీఆర్ఎస్ నేత సాదుల్కు గాయాలు
ఇల్లంతకుంట, ఏప్రిల్ 19: బీజేపీ, ఏబీవీపీ నాయకులు బరితెగించారు. మంత్రి కేటీఆర్ కార్యక్రమాన్ని అడ్డుకోవడమే కాదు.. టీఆర్ఎస్ నాయకులపైనా దాడికి పక్కాగా ప్లాన్చేశారు. ఇందుకోసం స్థానిక నాయకులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఏబీవీపీ, బీజేపీ నాయకులను భారీగా రప్పించారు. సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. కార్యక్రమాలను ముగించుకొని సిరిసిల్లకు బయలుదేరే సమయంలో రైతువేదిక వద్ద ఒక్కసారిగా ఏబీవీపీ, బీజేపీ నాయకులు మంత్రి కాన్వాయికి అడ్డుపడ్డారు. వీరం గం సృష్టించే ప్రయత్నం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు వెంటనే సదరు నాయకులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మం త్రి కాన్వాయికి అడ్డుపడిన బీజేపీ నాయకులపై ఫిర్యాదు చేయడానికి టీఆర్ఎస్ నాయకులు స్టేషన్‌కు వెళ్లారు. అప్పటికే అక్కడికి భారీగా చేరుకున్న ఏబీబీపీ, బీజేపీ నాయకులు.. టీఆర్ఎస్ నాయకులు స్టేషన్లోకి అడుగు పెట్టడమే ఆలస్యం అన్నట్టు దాడికి దిగారు. టీఆర్ఎస్వీ మండల అధ్యక్షుడు ఎండ్ర చందన్ కారుపై బండ రాయిని విసిరికొట్టారు. కారు ధ్వంసం కావడంతోపాటు కారు నడుపుతున్న ఉపసర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడు సాదుల్కు గాయాలయ్యాయి. అక్కడితో ఆగకుండా వాగ్వాదానికి దిగుతూ టీఆర్ఎస్ నాయకులపై దాడికి పాల్పడ్డారు. పోలీస్‌స్టేషన్‌లో శాంతియుతంగా ఫిర్యాదు చేయడానికి వస్తే.. తమపై ఎందుకు దౌర్జన్యం చేశారంటూ టీఆర్ఎస్ నాయకులు ప్రశ్నించినా.. వినకపోగా మరింత రెచ్చిపోయారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి గొడవ సద్దుమణిగేలా చేశారు. ఉమ్మడి జిల్లా నుంచి ఏబీవీపీ, బీజేపీ నాయకులు ఎం దుకు వచ్చినట్టు?, పోలీస్‌స్టేషన్ సాక్షిగా ఎందుకు దౌర్జన్యానికి దిగినట్టు? అన్న విషయాలను పరిశీలిస్తే.. ఉద్దేశపూర్వకంగానే కుట్ర పన్నిన విషయం అర్థమవుతున్నది. దీనిపై పోలీసులు లోతుగా విచారణ చేపడుతున్నారు.
Read Today's Latest Topstories News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
3,296 కోట్ల రేడియల్ రహదారి టెండర్లలో భారీ కుంభకోణం.. ప్రభుత్వానికి కేటీఆర్ బహిరంగ లేఖ
Crop Holiday | పండుగ వేళ ప్రభుత్వం చేదు వార్త.. యాసంగి సాగుకు సెలవే!
Revanth Reddy | కరెంట్ లేదు.. ఇవ్వలేం!.. పవర్ అక్కెరపడే పనుల్ని వాయిదా వేయాలి.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన
Horoscope | 11-10-2026 ఆదివారం.. మీ రాశి ఫలాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

