హైదరాబాద్, మార్చి 27 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో చివరి రోజైన గురువారం జీవోఅవర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై చిన్నచూపు చూశారు. 1.45 గంటల సమయంలో మొత్తం 52 మంది సభ్యులు తమ నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి తీసుకొచ్చారు. అధికార పార్టీ సభ్యులు ఎక్కువ సమయం తీసుకున్నారు. బీఆర్ఎస్ సభ్యులు మల్లారెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డికి ఒక్క నిమిషంలోపే మైక్ కట్ అయింది.
మేడ్చల్ నియోజకవర్గానికి దిష్టి తగిలిందా? అంటూ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ‘61 గ్రామాలు పోయి అన్ని మున్సిపాలిటీలు అయినయ్. కొత్తగా 3 మున్సిపాలిటీలు చేసిండ్రు. గతంల పదేండ్ల కోసం రిజర్వేషన్లు తెచ్చిండ్రు. ఇప్పడు ఐదేండ్లకే సమాప్తిజేసిండ్రు. మా 13 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో కలపొద్దు’ అని కోరారు. మాట్లాడుతుండగానే మైక్ కట్ అయింది.