BRS | కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్.. బీఆర్ఎస్లోకి నరోత్తం
BRS | కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నేత ఏర్పుల నరోత్తం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గురువారం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
BRS | హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీకి ఊహించని షాక్ తగిలింది. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కాంగ్రెస్ సీనియర్ నేత ఏర్పుల నరోత్తం కాంగ్రెస్‌కు గుడ్‌బై చెప్పారు. బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం లో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై గురువారం సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ నరోత్తంకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జహీరాబాద్ నియోజకవర్గం నుంచి నరోత్తం రెండుసార్లు టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేశారు.
రాష్ట్రంలో ప్రజలంతా సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకొంటున్నారని, ఈ నేపథ్యంలోనే తాను జహీరాబాద్ నియోజకవర్గ మేలుకోసం బీఆర్ఎస్లో చేరానని నరోత్తమ్ చెప్పారు. తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ దేశానికే ఆదర్శంగా నిలిపారని పేర్కొన్నారు. కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనను ప్రజలు కోరుకొంటున్న క్రమంలోనే తాను పార్టీలో చేరానని, బీఆర్ఎస్లో చేరడం సంతోషంగా ఉన్నదని చెప్పారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకత్వంలో పార్టీ కోసం, జహీరాబాద్ అభివృద్ధి, సంక్షేమం కోసం పాటుపడతానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్‌రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

