హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ) : వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్‌ను తెలంగాణ పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. ఓ చానల్ నిర్వహించిన లైవ్ డిబేట్లో పాల్గొన్న నాగార్జున.. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై మండిపడ్డారు. రేవంత్‌రెడ్డిని జొమాటో డెలివరీ బాయ్ అని సంబోధిస్తూ.. ప్రభుత్వ జీవోలు కూడా సరిగా చదవడం రాదని విమర్శించారు.
ఎమ్మెల్యేగా కూడా రేవంత్‌రెడ్డి పనికిరాడంటూ వ్యాఖ్యానించారు. దీంతో ఆదివారం నాగార్జున యాదవ్‌కు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా గుంటూరు జిల్లా సత్తెనపల్లిలో ఇంటికెళ్లి అదుపులోకి తీసుకున్నారు. కుటుంబసభ్యులు ప్రశ్నించడంతో తాము తెలంగాణ పోలీసులమని చెప్పినట్టు సమాచారం.