హైదరాబాద్, జూన్ 20 (నమస్తే తెలంగాణ): పంచాయతీరాజ్గ్రామీణ శాఖ మంత్రి సీతక, రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి ఇద్దరూ కలిసి ములుగు జిల్లాలోని గోదావరి నదిలో అక్రమంగా ఇసుకను మింగేస్తున్నారని బీఆర్ఎస్ నేత, రెడో మాజీ చైర్మన్ వై సతీశ్‌రెడ్డి ఆరోపించారు. సీతక్క తన శాఖలో ఉప్పులు, పప్పుల దగ్గర్నుంచి ఫోన్ల దాకా అన్ని సామ్‌లు చేశారని, ఇప్పుడు ఇసుకపై పడ్డారని విమర్శించారు. పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. భూములతోపాటు భూగర్భంలోని గనులను, ఉపరితలంపై ఉన్న వనరులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇప్పుడు సీతమ్మ సాగర్‌లో అక్రమంగా ఇసుక తవ్వి దాదాపు రూ.4 వేల కోట్లు వెనకేసుకునేందుకు ఇద్దరు మంత్రులు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. శనివారం తెలంగాణభవన్‌లో సతీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సీతమ్మ సాగర్‌లో అక్రమంగా నడుస్తున్న ఇసుక మైనింగ్‌తో సంబంధం లేదని సీతక, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మేడారం సమ్మక, సారలమ్మ గద్దెల వద్ద ప్రమాణం చేయాలని, లేకపోతే భద్రాచలం రాములోరి ఆలయంలో గానీ, ఇసుక తవ్వుతున్న మల్లూ రు లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి వచ్చి ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు.
ఒకవేళ తాను చేసిన ఆరోపణలు తప్పైతే.. సమ్మ క గద్దెల దగ్గర ముకు నేలకు రాస్తానని సతీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. మం త్రులు తప్పు చేసి, కేటీఆర్ క్షమాపణలు చెప్పాలనడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఇసుక మైనింగ్ సంబంధించిన వీడియోలను చూపించారు. ములుగు జిల్లా మంగపేట, వెంకటాపూర్, వాజేడు మండలాల పరిధిలో ని గోదావరిలో 12 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వకాల కోసం అక్రమంగా అనుమతులు తెచ్చుకున్నారని ఆరోపించారు. రా ష్ట్రంలో మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రాదని అర్థమైపోయి పూర్తిగా దోపిడీ మీదే పడ్డారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏడాదిలోనే 12 కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక తవ్వేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
అక్రమంగా అనుమతులు..
బరాజ్ నిర్మాణమే పూర్తికాకుండా డీసిల్టేషన్ పేరుతో అక్రమ పద్ధతుల్లో ఇసుక తవ్వకాలకు అనుమతులు తెచ్చుకున్నారని సతీశ్‌రెడ్డి విమర్శించారు. ములుగు జిల్లాలో ఎలాంటి ముంపు గ్రామాలు లేవని, అయినా అనుమతి ఎలా ఇచ్చారని అధికారులను ప్రశ్నించారు. మంత్రులు సీతక, పొంగులేటి ప్రమేయం లేకుండా.. ఆగమేఘాల మీద నెల రోజుల్లో అనుమతులు ఎలా వచ్చాయని నిలదీశారు. ఈ ఏడాది ఏప్రిల్ 25న చీఫ్ ఇంజినీర్ లేఖ రాశారని, ఏప్రిల్ 1న టీఎస్ఎండీసీ ఎండీ లేఖ రాశారని, ఆ వెంటనే ఏప్రిల్ 15న భద్రాద్రి కొత్తగూడెం ఈఈ లెటర్ రాశారని గుర్తుచేశారు. ఏప్రిల్ 21న జాయింట్ ఇన్స్పెక్షన్ కూడా పూర్తయ్యిందని, అయితే.. రెవెన్యూ అధికారులు లేకుండానే మైనింగ్, ఇరిగేషన్ అధికారులు మమ అనిపించేశారని పేర్కొన్నారు. ఆ వెంటనే ఏప్రిల్ 24న డిస్ట్రిక్ట్ లెవల్ శాండ్ అప్రూవల్ కమిటీ కూడా అనుమతిచ్చిందని ఆరోపించారు. ఆ మరుసటి రోజునే కలెక్టర్ సంతకం కూడా పెట్టారని, ఆ వెంటనే కలెక్టర్ బదిలీ అయ్యారని తెలిపారు. ఏప్రిల్ 29న గ్రామసభ కోసం టీజీఎండీసీ నుంచి ఎంపీడీవో కార్యాలయానికి లేఖ వచ్చిందని, గ్రామసభ పెట్టాలని కార్యదర్శికి అదేరోజు ఎంపీడీవో సిఫార్సు చేశారని తెలిపారు. గ్రామకార్యదర్శి నోటీసు ఇచ్చి మే 4న గ్రామసభ పెట్టారని తెలిపారు. ఆ మరుసటి రోజే అంటే మే 5 నుంచి అధికారికంగా ఇసుక తవ్వకాలు మొదలుపెట్టారని ఆరోపించారు.
కొత్త కలెక్టర్‌కు స్థానికుల ఫిర్యాదు
ఇసుక తవ్వకాలపై స్థానిక ప్రజలు కొత్త కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారని సతీశ్‌రెడ్డి గుర్తుచేశారు. మైనింగ్ అనుమతులు రద్దు చేయాలని మే 20న మైనింగ్‌శాఖకు కలెక్టర్ లేఖ రాశారని గుర్తుచేశారు. కానీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని, యథేచ్ఛగా ఇసుక తవ్వేస్తున్నారని విమర్శించారు. ఇప్పటికే 15 నుంచి 20 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక తీశారని, నది ఒడ్డున గుట్టలుగా పోశారని వీడియోలు చూపించారు. వెంటనే ఆ ఇసుకను సీజ్ చేసి మైనింగ్ పనులు ఆపాలని, ఇప్పటికే వచ్చిన ఆదాయాన్ని మూడు గ్రామాల అభివృద్ధికి వినియోగించాలని డిమాండ్ చేశారు.