హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకులు అంటేనే అవినీతిపరులనే ముద్ర ఉన్నది. కానీ అందులో కూడా నిజాయితీగా పనిచేసే అధికారులు, నాయకులు ఎంతోమంది ఉన్నారు. అలాంటి వారిని ప్రభుత్వ శాఖలవారీగా గుర్తించి ఘనంగా సతరిస్తున్నారు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ నిర్వాహకులు. అందులోభాగంగా సెప్టెంబర్ 1న హైదరాబాద్ బేగంపేటలోని పీపుల్స్‌ప్లాజాలో10 మంది నిజాయితీ అధికారులను సత్కరించబోతున్నారు.
‘సమాజంలో అందరూ అవినీతిపరులు ఉండరు. అలానే అంతా నిజాయితీపరులు కూడా ఉండరు. అందుకే నిజాయితీ అధికారుల సంఖ్య పెరిగే దిశగా యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ వినూత్న కార్యక్రమాలు చేస్తున్నది. నిజాయితీగా పనిచేస్తున్న రాజకీయ నాయకులను, అధికారులను గుర్తించి వారిని సతరించి ఇప్పటితరానికి పరిచయం చేయబోతున్నాం’ అని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి తెలిపారు.