మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 08:24:45

మిర్యాలగూడ‌లో పోలీస్ వాహ‌నం చోరీకి య‌త్నం

మిర్యాలగూడ‌లో పోలీస్ వాహ‌నం చోరీకి య‌త్నం

నల్ల‌గొండ: బ‌హిరంగ ప్ర‌దేశంలో మ‌ద్యం తాగుతూ ప‌ట్టుబ‌డ్డారు. మ‌త్తులో ఉన్న ఓ యువ‌కుడు ఏకంగా పోలీసుల వాహ‌నంలోనే ప‌రారయ్యేందుకు ప్ర‌య‌త్నించాడు. జిల్లాలోని మిర్యాలగూడ‌ పట్టణంలో సీఐ ర‌మేశ్ బాబు నిన్న రాత్రి త‌న బృందంతో పెట్రోలింగ్ చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ప‌ట్ట‌ణ శివార్ల‌లోని ఈదులగూడ ఉన్న ఓ వెంచర్‌లో మద్యం సేవిస్తూ నలుగురు యువకులు కనిపించారు. దీంతో వారిని సీఐ విచారిస్తున్న సమయంలోనే అందులోని ఓ యువకుడు.. పోలీసుల కళ్లు గప్పి సీఐ వాహనంతో కోదాడ వైపు పరారయ్యాడు. అత‌డిని వెంబ‌డించిన పోలీసులు చివ‌ర‌కు ఆళ్ల‌గడప టోల్ గేటు వద్ద వాహానాన్ని ప‌ట్టుకున్నారు. అందులో ఉన్న యువకుడిని అదుపులోకి తీసుకుని, వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.