Madhya Pradesh | ‘ఫిదాయీ’ పేరుతో ఆత్మాహుతి దళం! భోపాల్‌లోని రైసన్ అడవుల్లో యువతకు శిక్షణ
మధ్యప్రదేశ్‌లోని భోపాల్ కేంద్రంగా హిజ్బ్ ఉత్ తహ్రీర్ (హెచ్‌యూటీ) ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకు ప్రత్యేకంగా ‘ఫిదాయీ’ అనే ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం.
- కోడ్ భాషలో హెచ్‌యూటీ టెర్రరిస్టుల వీడియోలు
- తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, ఏటీఎస్ డీకోడింగ్
- భోపాల్‌లో రైల్వేస్టేషన్, స్టేడియం, డ్యామ్ బ్లాస్ట్‌కు కుట్ర!
Madhya Pradesh | హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): మధ్యప్రదేశ్‌లోని భోపాల్ కేంద్రంగా హిజ్బ్ ఉత్ తహ్రీర్ (హెచ్‌యూటీ) ఉగ్రవాదులు భారీ పేలుళ్లకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది. ఇందుకు ప్రత్యేకంగా ‘ఫిదాయీ’ అనే ఆత్మాహుతి దళాన్ని సిద్ధం చేస్తున్నట్టు సమాచారం. ఇటీవల భోపాల్, హైదరాబాద్‌లో అరెస్టయిన హెచ్‌యూటీ ఉగ్రవాద సంస్థకు చెందిన రాడికల్ ఇస్లామిస్టులను తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, భోపాల్ యాంటీ టెర్రరిస్టు స్కాడ్ (ఏటీఎస్) పోలీసులు విచారించగా పేలుళ్ల కుట్ర బయటపడింది. భోపాల్‌లోని భోజ్‌పురా సమీపంలోని రైసన్ అడవుల్లో హైదరాబాద్-భోపాల్ యువకులకు జిమ్ ట్రైనర్ యాసిర్ ఉగ్ర శిక్షణ ఇచ్చినట్టు విచారణలో తేలింది. హెచ్‌యూటీ కోడ్ భాషలో ఫిదాయీ అంటే.. ఆత్మాహుతి దాడి అని డీ కోడ్ ద్వారా పోలీసులు తెలుసుకున్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న రాడికల్ ఇస్లామిస్టులను మరింత లోతుగా విచారిస్తుండగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి.
భారీ పేలుళ్లకు కుట్ర!
ఫిదాయీ అనే ఆత్మాహుతి దళానికి కోడ్ భాషను నేర్పుతున్నట్టు అరెస్టయిన వారి వద్ద దొరికిన 50కిపైగా వీడియోల్లో పోలీసులు గుర్తించారు. కోడ్ భాషను డీ కోడ్ చేయగా హెచ్‌యూటీ ఉగ్రవాదులు భోపాల్‌లోని రాణి కమలాపతి రైల్వేస్టేషన్, మోతీలాల్ నెహ్రూ స్టేడియం, బరాసియా డ్యామ్ వద్ద బాంబు పేలుళ్లకు ప్లాన్ చేసినట్టు వెల్లడైంది. ఈ పేలుళ్లకు సూత్రధారిగా, పాత్రధారిగా చివరికి ఓ మానవ బాంబుగా మారేందుకు జిమ్ ట్రైనర్ యాసిర్ ఖాన్ సిద్ధమైనట్టు విచారణలో తెలిసింది. వీటితోపాటు ఈ ఏడాదిలో జరిగే మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు రద్దీ ప్రాంతాల్లో సైతం ఆత్మాహుతి దాడులకు ప్రణాళిక రచించినట్టు సమాచారం. అరెస్టుకు ముందే యాసిర్ అనేక డిజిటల్ సాక్ష్యాలను ధ్వంసం చేసినట్టు గుర్తించారు. వీరి సంభాషణల్లో తరచుగా బిర్యానీ, లడ్డూ, అనర్దన వంటి కోడ్ పదాలను వాడినట్టు గుర్తించారు.
హవాలా మార్గంలో డబ్బు!
హెచ్‌యూటీ ఉగ్రవాదుల కార్యకలాపాల కోసం విదేశాల నుంచి హవాలా మార్గంలో నిధులు వచ్చినట్టు తెలంగాణ కౌంటర్ ఇంటెలిజెన్స్, ఏటీఎస్ పోలీసులు గుర్తించారు. నిధులతోపాటు విదేశాల నుంచి వాయిస్ నోట్స్ నిరంతరం అందుతున్నాయని వెల్లడైంది. ముఖ్యంగా దుబాయ్‌కి చెందిన ఓ బడా వ్యాపారవేత్త సాయంతో మధ్యప్రదేశ్‌లో హవాలా ద్వారా నిధులు సమకూర్చినట్టు ఆధారాలు లభించాయి. ఆ డబ్బులు ఉగ్రవాదుల వరకు చేరేలా వారి భార్యలు కీలకంగా వ్యవహరించినట్టు విచారణలో తెలిసింది. ప్రస్తుతం అరెస్టయినవారిలో 10 మంది నిందితులను మే 24 వరకు విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dhanush Party | ధనుష్ కొత్త పార్టీ అంటూ వార్తలు.. టీవీకే స్పందన ఏమిటంటే..!
Ravana Dahan | రావణుడిని దహనం చేయని ఊరు.. ఈ శివాలయం వెనుక కథేంటి?
Constipation | మలబద్ధకంతో బాధపడుతున్నారా.. ? అయితే ఈ 5 రకాల పండ్లను మీ డైట్లో చేర్చుకోండి..!
Crude Oil Price | ఐదు నెలల గరిష్ఠానికి ముడిచమురు ధరలు.. కారణాలివే..!
Daaku Maharaj | ‘డాకు మహారాజ్’ ఓఎస్టీ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎట్టకేలకు అభిమానుల చిరకాల కోరిక తీరనుందా?
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

