హైదరాబాద్, జూలై 8 (నమస్తే తెలంగాణ): మోదీ ఫాసిస్టు విధానాలపై యువత ఐక్యంగా ఉద్యమించాలని, ఉపాధి కల్పించని పాలకులను రానున్న ఎన్నికల్లో ఓడించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి, మాజీ ఎంపీ సయ్యద్ అజీజ్‌పాషా పిలుపునిచ్చారు. అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) జాతీయ వర్‌షాప్ శనివారం హైదరాబాద్‌లోని సత్యనారాయణరెడ్డి భవన్లో ప్రారంభమైంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ పాలనలో అన్ని వర్గాలు కష్ట సమయాన్ని ఎదుర్కొంటున్నాయని వాపోయారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలతో దక్షిణ భారతంలో బీజేపీ గేట్ వే మూసుకుపోయిందని స్పష్టం చేశారు. ప్రధాని స్థాయిలో ఉండి మతపరమైన, విభజన రాజకీయాలను మోదీ ప్రోత్సహించడం దారుణని మండిపడ్డారు.