బిజినేపల్లి : యువత చెడు అలవాట్లకు బానిస కాకుండా,అన్ని రంగాల్లో మంచి ప్రతిభ కనబరిచి రాణించాలని ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి ( MLA Rajesh Reddy ) అన్నారు. ఆదివారం మండలంలోని పాలెం గ్రామంలో జమాత్ ఇస్లామి హింద్ ( Jamaat-e-Islami Hind ) ఆధ్వర్యంలో మైనార్టీ విద్యార్థులకు నిర్వహిస్తున్న స్కిల్ డెవలప్మెంట్ విద్యా అవగాహన సదస్సులో పాల్గొన్నారు.
అనంతరం సమీపంలోనే ఉన్న దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మైనార్టీ నాయకులు జహంగీర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ నజీర్ నాయకులు రాములు, ఖలీల్ రామకృష్ణ, ముస్లిం మత సంఘాల పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.