సిరిసిల్ల: సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని జగ్గారావు పల్లెలో విషాదం చోటుచేసుకుంది. జగ్గారావుపల్లెలో గురువారం అర్ధరాత్రి 1.30 గంటల సమయంలో రోడ్డు పక్కన ఉన్న యువకులపైకి ఇసుక లారీ దూసుకెళ్లింది. దీంతో తాళ్ల అఖిల్ గౌడ్ (21) తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో హైదరాబాద్లోని యశోద దవాఖానకు తరలించారు. అయితే చికిత్స పొందుతుండగా అఖిల్ మరణించాడు. దీంతో జగ్గారావు పల్లెలో విషాదం నెలకొన్నది.