Hyderabad | సుల్తాన్‌బజార్, జనవరి 7 : కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ ప్రియాంక గాంధీపై బీజేపీ నాయకుడు రమేశ్ బిదూరీ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా యూత్ కాంగ్రెస్ నేతలు నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంపై మంగళవారం దాడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు ఎదురుదాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది.
కాంగ్రెస్ కార్యకర్తలు బీజేపీ కార్యాలయంపైకి రాళ్లు విసరగా, బీజేపీ శ్రేణులు కర్రలతో అడ్డుకొన్నారు. ఈ ఘటనలో బీజేపీకి చెందిన ఓ కార్యకర్త తలకు గాయమైంది. ఇంతలో అక్కడికి భారీ ఎత్తున చేరుకున్న పోలీసులు ఇరు పార్టీల కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ దాడిని టీపీసీసీ తీవ్రంగా పరిగణించింది. యూత్ కాంగ్రెస్ నేతలు ఇలా మరో రాజకీయ పార్టీ కార్యాలయంపైకి వెళ్లడం సరైంది కాదని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ అన్నారు. ఈ దాడిని బీజేపీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు. దుర్మార్గ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు.