హైదరాబాద్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): లోన్ యాప్ వేధింపులకు యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన విశాఖపట్నంలో చోటుచేసుకున్నది. అంగ డి దిబ్బకు చెందిన నరేంద్ర(21)కు 40రోజుల క్రితం పెండ్లయ్యింది. వ్యక్తిగత అవసరాల కోసం నరేంద్ర ఓ ప్రైవేట్ యాప్లో లోన్ తీసుకొని, తిరిగి అప్పు చెల్లించాడు. అయితే, మరో రూ.2వేలు చెల్లించాలని లో న్ యాప్ సిబ్బంది నరేంద్రను వేధించారు. త్వరలోనే చెల్లిస్తామన్నా.. వినకుండా నరేం ద్ర భార్య ఫొటోలను మార్ఫింగ్ చేసి బం ధువులకు పంపించారు. తన పరువు పో యిందని మనస్థాపానికి గురైన నరేంద్ర.. మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు.