బుధవారం 08 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 11:10:47

ప్రభుత్వ సూచనలు పాటించని యువత అరెస్ట్‌.. వాహనాలు సీజ్‌

ప్రభుత్వ సూచనలు పాటించని యువత అరెస్ట్‌.. వాహనాలు సీజ్‌

రంగారెడ్డి: రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన సూచనలు పట్టించుకోకుండా, యదేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్న యువతను పోలీసులు అరెస్ట్‌ చేసి, వాహనాలు సీజ్‌ చేశారు. జిల్లాలోని కొత్తూరులో ఈ ఘటన చోటుచేసుకుంది. అరెస్ట్‌ చేసిన వారిని సాయంత్రం వరకు స్టేషన్‌లోనే ఉంచుతామని పోలీసులు తెలిపారు. సీజ్‌ చేసిన వాహనాలు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మెడికల్‌, నిత్యావసర వస్తువులు తీసుకునేందుకు మాత్రమే ప్రజలు బయటకు రావాలని పోలీసులు సూచించారు. 

కాగా, ఈ నెల 31 వరకు రాష్ట్రంలో జనతా కర్ఫ్యూ పాటించాలని సీఎం ప్రెస్‌మీట్‌లో వెల్లడించిన విషయం తెలిసిందే. నిన్న పాటించినట్లే, ఈనెల ఆఖరి వరకు స్వీయనిర్బంధం పాటించాలని సీఎం సూచించారు. సామాజిక దూరం పాటిస్తూ.. ఎవరికి వారే తగిన జాగ్రత్తలు తీసుకుంటే కరోనా మహమ్మారిని తరిమేయవచ్చని సీఎం తెలిపారు. ఎలాంటి అనారోగ్య లక్షణాలు కనిపించినా ఆస్పత్రికి వెళ్లి, వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని సీఎం పేర్కొన్నారు. కొన్ని రోజుల పాటు మనం ఇళ్లల్లో ఉంటే సమాజానికి సేవ చేసినట్లేనని సీఎం తెలిపిన విషయం విదితమే.


logo