మల్లాపూర్, అక్టోబర్ 20: పాత గొడవలను మనసులో పెట్టుకొని ఓ వ్యక్తి సొంత అన్నను అతిదారుణంగా హత్య వేశాడు. . జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం ఓబులాపూర్‌కు చెందిన పల్ల పు నర్సయ్య- గంగు దంపతులకు ఏడుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మూడో కుమారుడు సాయిలు (34), నాలుగో కుమారుడు చంద్రి. వీరికి కొ న్నేండ్లుగా భూత గాదాలున్నాయి. పలుమార్లు పంచాయితీ పెట్టారు. పరస్పర దాడులు జరగ్గా పోలీస్‌స్టేషన్‌లో సైతం కేసు లు నమోదయ్యా యి. ఆదివారం గోదావరి ప్రాంతం వద్ద సాయిలు ఉన్న విషయాన్ని గమనిం చి.. చంద్రి తల్వార్‌తో దాడిచేసి దారుణంగా నరికి చంపాడు. తల, మొండెం వేరు చేశాడు. మెట్పల్లి డీఎస్పీ ఉమామహేశ్వరరావు, సీఐ నిరంజన్‌రెడ్డి, ఎస్సై కిరణ్‌కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.