సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని మాచ్నుర్ ప్రధాన రహదారిపై శనివారం ఓ యువకుడు తాగు నీటికోసం నిరసన చేపట్టాడు. రోడ్డుపై ముళ్ల కంచె వేసి ఖాళీ బిందెలతో ఆందోళన చేపట్టడంతో ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి.
15 రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడంలేదని, గ్రామంలోని బోరు ద్వారా కూడా నీటిసరఫరా కావడం లేదని వాపోయాడు. బీజేపీ నాయకుడి హామీతో ఆ యువకుడు ఆందోళన విరమించాడు.
– ఝరాసంగం