చిగురుమామిడి, జనవరి 27: ‘నా చావుకు కుటుంబసభ్యులే కారణం’ అం టూ ఓ యువకుడు సెల్ఫీ వీడియో పెట్టి ఆత్మహత్య చేసుకున్న ఘటన కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా .. రామంచకు చెందిన నాగెల్లి రాజిరెడ్డి- అనసూయ దంపతులకు ముగ్గురు కొడుకులు. పెద్ద కొడుకు నాగెల్లి వెంకటేశ్రెడ్డి(29)కి రెండు నెలల క్రితం వివాహమైంది. చిన్నములనూరులో రూ.12 లక్షలతో సూపర్ మారెట్ ఏర్పాటు చేసి వెం కటేశ్రెడ్డితో పాటు చిన్న కొడుకు నడిపించాలని రాజిరెడ్డి ఇద్దరు కొడుకులకు సూ చించాడు. కొంతకాలంగా తల్లిదండ్రులతో వెంకటేశ్రెడ్డికి గొడవలు వచ్చాయి. సూపర్ మారెట్కు రూ.17 లక్షల పెట్టుబడి పెట్టామని, ఆ డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ వెంకటేశ్రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.