మారేడ్‌పల్లి, ఏప్రిల్ 5: ఆన్లైన్ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకున్న ఓ యువకుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సికింద్రాబాద్‌లో చోటుచేసుకుంది. రైల్వే పోలీసుల వివరాల ప్రకారం.. సుచిత్రలోని బీహెచ్ఈఎల్ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్న రాజ్వీర్సింగ్ ఠాకూర్ (25) ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అప్పులు చేసి ఆన్లైన్ గేమ్స్‌లో డబ్బులు పోగొట్టుకున్నాడు.
ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు సం ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని గాంధీ దవాఖానకు తరలించి.. కేసును దర్యాప్తు చేస్తున్నారు.