కూసుమంచి, జనవరి 17: ఖమ్మం జిల్లా కూసుమంచికి చెందిన తవసి విజయ్ (25) సంక్రాంతి సందర్భంగా స్థానికంగా ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నీలో ఆడుతుండగా ఛాతీలో నొప్పిరాడంతో కిందపడిపోయాడు. వెంటనే స్నేహితులు దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే అతడు మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు.