మెదక్,సెప్టెంబర్ 11 : స్కూటీ అదుపుతప్పి యువకుడు మృతి(Died) చెందిన సంఘటన మెదక్(Medak) జిల్లా అల్లాదుర్గం పోలీస్టేషన్ పరిధిలోని రాంపూర్ వద్ద చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా జోగిపేటకు చెందిన సాయికిరణ్(28)పెద్దశంకరంపేట నుంచి జోగిపేట వైపు వెళ్తున్న క్రమంలో రాంపూర్ వదదకు రాగానే స్కూటీ అదుపు తప్పి కిందపడిపోయాడు.
దీంతో తలకు తీవ్రంగా గాయం కావడంతో చికిత్స నిమిత్తం 161 నేషనల్ హైవే ఆంబులెన్స్‌లో జోగిపేట ప్రభుత్వ దవఖానాకు తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. సాయికిరణ్ మతితో బంధువల రోదనలు మిన్నంటాయి.