రాజోళి, సెప్టెంబర్ 14: విద్యుదాఘాతంతో యువ రైతు మృతి చెందిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా రాజోళి మండలంలో చోటుచేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. తుమ్మలపల్లి యువ రైతు మద్దూరు శివారెడ్డి (28) నీళ్లు పెట్టేందుకు ఆదివారం పొలానికి వెళ్లాడు. తుంగభద్ర తీరంలో మోటర్‌ను ఆన్ చేసే క్రమంలో విద్యుదాఘాతానికి గురయ్యాడు.