పెంబి, మార్చి 31 : విద్యుదాఘాతంతో రైతు మృతిచెందిన ఘటన నిర్మల్ జిల్లా పెంబి మండలం మందపెల్లి శివారులో చోటుచేసుకున్నది. రైతు ఆత్రం నాగోరావు (35) సోమవారం ఉదయం మక్క చేనుకు నీరందించడానికి పొలానికి వెళ్లాడు.
మోటర్ ఆన్ చేస్తుండగా విద్యుత్తు షాక్తో అక్కడికక్కడే మృతి చెందాడు. మధ్యాహ్నం పంటకు కాపలా కోసం వెళ్లిన అతని సోదరుడు గమనించి కుటుంబసభ్యులు, పోలీసులకు సమాచారం అందించాడు.