దంతాలపల్లి, ఏప్రిల్ 28: వరి ధాన్యం తాలు పడుతుండగా ప్రమాదవశాత్తు ఫ్యాన్ తగిలి యు వకుడు మృతి చెం దాడు. ఈ ఘటన మ హబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలంలో ఆదివారం జరి గింది. మండలంలోని తూర్పుతండా గ్రామ పంచాయతీ పరిధిలోని మోగ్యతండాకు చెందిన భూక్యా వెంకన్న-పార్వతి దంపతుల కుమారుడు ఈశ్వర్ (18) ఇంటర్ పూర్తి చేశాడు.
వేసవి సెలవులు కావడంతో రామవరం గ్రామంలో ఓ రైతుకు వడ్లు తాలు పట్టేందుకు కూలికి వెళ్లాడు. వడ్లు పట్టేందుకు ఫ్యాన్‌ను సరిచేస్తుండగా ఒక్కసారిగా ఆన్ కావడంతో ఈశ్వర్ తలకు తగిలి తీవ్రగాయాలయ్యాయి. వెంటనే దవాఖానకు తరలిస్తుండగా మృతి చెందాడు.