హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : అరెస్టులతో లగచర్ల లడాయిని ఆపలేరని మాజీ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. కొడంగల్ రైతులపై కాంగ్రెస్ సర్కార్ దౌర్జన్యం కొనసాగుతున్నదని శనివారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘కొడంగల్ నియోజకవర్గం లగచర్లలో మరో 8 మంది పేద గిరిజన రైతులకు సంకెళ్లు. ఇలా బెదిరింపులతో రైతులను భయపెట్టలేరు. రైతులతో పెట్టుకున్నావ్.. నీ పతనం మొదలైంది చిట్టినాయుడు’ అని హరీశ్ హెచ్చరించారు.