KCR | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గాయం నుంచి కోలుకుంటున్నారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స శుక్రవారం విజయవంతంగా జరిగిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వైద్యుల పర్యవేక్షణలో ఉండగా.. ఇవాళ వైద్యులు ఆయనను నడిపించినట్లు హెల్త్ బులిటెన్లో పేర్కొంది. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని, వేగంగా కోలుకుంటున్నారని చెప్పింది. అంతర్జాతీయ వైద్య ప్రమాణాల ప్రకారం సర్జరీ చేసిన 12గంటల్లోగా నడిపించాల్సి ఉంటుందని తెలిపింది. కేసీఆర్కు వైద్యం అందిస్తున్న ఆర్థోపెడిక్ నిపుణుల సమక్షంలో నడిపించినట్లు పేర్కొంది. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సంతృప్తిగా ఉన్నట్లు యశోద ఆసుపత్రి వైద్యుల బృందం హెల్త్ బులిటెన్లో వివరించింది.